● పోలీసులను ఆశ్రయించిన
కుటుంబ సభ్యులు
● పోక్సో కేసు నమోదు
ఊట్కూర్: ప్రేమ పేరుతో యువతిని(19) మోసం చేసిన పులిమామిడికి చెందిన యువకుడు బి.శ్రీకాంత్‌పై పోక్సో కేసు నమోదు చేసినట్లు బుధవారం ఎస్‌ఐ రమేశ్ తెలిపారు. అదే గ్రామానికి చెందిన యువతి, యువకుడు మూడేళ్లుగా ప్రేమించుకున్నారు. కొంతకాలంగా యువతి పెళ్లి చేసుకుందామని యువకుడిని కోరగా ఇంట్లో కుటుంబ సభ్యులు ఒప్పుకోవడం లేదని చెబుతూ వచ్చాడు. యువతి పక్షం రోజుల క్రితం యువకుని ఇంటికి వెళ్లి పెళ్లి విషయమై నిలదీయగా ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. యువకుడు నిన్ను పెళ్లి చేసుకోవడం కుదరదని చెప్పడంతో యువతి మనస్తాపం చెంది పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు గమనించి యువతిని నారాయణపేట ఏరియా ఆప్పత్రికి తరలించారు. ఈ విషయమై యువతి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించగా.. విచారణ చేపట్టి యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
చికిత్స పొందుతూ
యువకుడి మృతి
మిడ్జిల్: మండలంలోని బోయిన్‌పల్లి సమీపంలో మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డుప్రమాదంలో వ్యక్తి మృతిచెదిన ఘటన చోటుచేసుకంది. ఎస్‌ఐ శివనాగేశ్వర్‌నాయు డు కథనం ప్రకారం.. మండలంలోని బోయిన్‌పల్లికి చెందిన బోయశేఖర్(38) మంగళవా రం సాయంత్రం బైక్‌పై మిడ్జిల్ నుంచి ఇంటికి వెళ్తుండగా.. గ్రామ సమీపంలో వెనుక నుంచి వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో బలమైన గాయాలయ్యాయి.చికిత్స నిమిత్తం మహబూబ్‌నగర్ ఆస్పత్రికి తరలించగా.. పరి స్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌లోని ని మ్స్‌కు రెఫర్ చేశారు. చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందినట్లు తెలిపారు. మృతు డి భార్య శైలజ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
చికిత్స పొందుతూ
వ్యక్తి మృతి
నవాబుపేట: మండలంలోని కొల్లూర్‌కు చెందిన వ్యక్తి చికిత్సపొందుతూ మృతిచెందాడు. కొల్లూర్‌కు చెందిన శ్రీనివాస్(49)ఈనెల 21న తన పొలానికి బైక్‌పై వెళ్తుండగా.. ప్రమాదవశాత్తు కిందపడి గాయపడ్డాడు. అక్కడున్నవారు కుటుంబ సభ్యుల సహకారంతో జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించిందని హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొంది ఈనెల 23వ తేదీన ఇంటికి వస్తుండగా మార్గమధ్యంలో మరోసారి అనారోగ్యం పాలయ్యాడు. షాద్‌నగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడి కుమారుడు శివప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్లు ఎస్‌ఐ విక్రమ్ తెలిపారు.
జాతీయ బాక్సింగ్ పోటీలకు సరస్వతి
మహబూబ్‌నగర్ క్రీడలు: నాగ్‌పూర్‌లో వచ్చేనెల 4 నుంచి 11 వరకు జరిగే జాతీయస్థాయి బాక్సింగ్ పోటీలకు ఉమ్మడి జిల్లాలోని మానవపాడుకు చెందిన సరస్వతి ఎంపికై ంది. హైదరాబాద్‌లోని షేక్‌పేట్‌లో ఈ నెల 22 నుంచి 24 వరకు జరిగిన రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీల్లో సరస్వతి అండర్–19 విభాగంలో ప్రతిభకనబరిచి బంగారు పతకం సాధించి జాతీయస్థాయి పోటీలకు ఎంపికై ంది. సరస్వతిని బుధవారం రాష్ట్ర ప్రభుత్వ క్రీడల సలహాదారు ఏపీ జితేందర్‌రెడ్డి అభినందించారు. కార్యక్రమంలో డీవైఎస్‌ఓ శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి నర్సింహులు, ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి కురుమూర్తిగౌడ్, అథ్లెటిక్స్ కోచ్ సునీల్‌కుమార్, శంకర్, శశికిరణ్ పాల్గొన్నారు.


