బీచుపల్లిలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

బీచుపల్లిలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం

Mar 26 2026 10:44 AM | Updated on Mar 26 2026 10:44 AM

ఎర్రవలి: బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని కోదండరామస్వామి ఆలయంలో శ్రీరామనవమిని పురస్కరించుకొని పంచాహ్నిక బ్రహ్మోత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉత్సవాల్లో భాగంగా మొదటిరోజు ఆలయంలో గరుడ పటంతో గ్రామ ప్రదక్షణ, ధ్వజస్తంభ స్నపనం, ధ్వజారోహణం, అష్టదిగ్భందనం, యాగశాలలో ప్రధాన కుంభ ఆరాధన, అగ్ని ప్రతిష్ఠ, మూర్తి మంత్ర హోమం, లఘుపూర్ణాహుతి, తీర్థ ప్రసాద వితరణ వంటి పూజా కార్యక్రమాలను అర్చకులు వైభవంగా నిర్వహించారు. చుట్టు ప్రక్కల గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ మేనేజరు సురేందర్‌రాజు, పాలక మండలి సభ్యులు, అర్చకులు, భక్తులు, తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement