అపర భద్రాది ‘సిర్సనగండ్ల’ | - | Sakshi
Sakshi News home page

అపర భద్రాది ‘సిర్సనగండ్ల’

Mar 26 2026 10:44 AM | Updated on Mar 26 2026 10:44 AM

ఏర్పాటు పూర్తి

కార్యక్రమాలు ఇలా..

చారకొండ: రాష్ట్రంలోనే రెండో అపర భద్రాద్రిగా భ క్తులు చేత పూజలందుకుంటున్న సిర్సనగండ్ల సీతారామచంద్రస్వామి ఆలయం బ్రహోత్సవాలకు ము స్తాబైంది. గురువారం నుంచి మార్చి 7 వరకు ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగనున్నాయి. ప్రతి ఏటా శ్రీరామనవమిని పురస్కరించుకొని వేడుకల ను నిర్వహించడం ఆనవాయితీ. ఈ పుణ్యక్షేత్రం నాగర్‌కర్నూల్‌ జిల్లా చారకొండ మండలంలోని సిర్సనగండ్ల పంచాయతీలో పరిధిలో అయోధ్యనగర్‌ (గుట్ట)పైన సుమారు 60 ఎకరాల్లో 300 అడుగుల ఎతైన ఏకశిలపై వెలసింది. ఉమ్మడి మ హబుబ్‌నగర్‌ నుంచే కాకుండా రంగారెడ్డి, హైదరాబాద్‌, నల్గొండ జిల్లాల నుంచి లక్షలాది మంది భక్తు లు బ్రహోత్సవాలకు హాజరై స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటారు. శ్రీరామనవమి రోజున భద్రాచలం మాదిరిగానే ఇక్కడ కూడా లాంఛనాలతో సీతారాముల కల్యాణం జరిపిస్తారు.

పక్షం రోజుల పాటు కొనసాగే బ్రహోత్సవాల కోసం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. శు క్రవారం జరిగే కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు భక్తు లు అధిక సంఖ్యలో హాజరు కానున్న నేపథ్యంలో ఆల య ప్రాంగణంలో చలువ పందిళ్లు వేశారు. తాగునీటి సౌకర్యం,విద్యుత్‌ సరాఫరాకు ఎలాంటి ఆటంకం లేకుండా చర్యలు చేపట్టారు.అలాగే అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్‌ బందోబస్తు నిర్వహించనున్నారు.

ఆలయ రాజగోపురం

బ్రహోత్సవాల్లో భాగంగా మొదటి రోజు గురువారం మధ్యాహ్నం 12 గంటలకు సీతారామచంద్రస్వామి మాసకల్యాణం, శుక్రవా రం మధ్యాహ్నం 12 గంటలకు మహా కల్యా ణోత్సవం, హనుమత్‌ సేవ, శనివారం చిన్న రఽథం (చిన్నతేరు), ఆదివారం గరుడ సేవ, సోమవారం రాత్రి బ్రహోత్సవం (పెద్దరథం), మంగళవారం జగసేవ, దోపోత్సవం, బుధవారం చక్రతీర్థం, ఏకాంత సేవ, ద్వాదశ ఆరాధన తదితర కార్యక్రమాలు ఉంటాయని ఆలయ చైర్మన్‌ డేరం రామశర్మ, ఈఓ స్వర్గం అంజనేయులు తెలిపారు.

ఏకశిలపై కొలువైన సీతారామచంద్రులు

నేటి నుంచి ఉత్సవాలు ప్రారంభం

వైభవంగా కల్యాణోత్సవం

ఆలయ కమిటీ ఆధ్వర్యంలో

ఏర్పాట్లు పూర్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement