భారత జట్టులో విరాట్‌కోహ్లీ అంటే ఎంతో ఇష్టం. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని క్రికెట్ ఆడడం ప్రారంభించా. తల్లిదండ్రుల ప్రోత్సాహం, కోచ్ భరత్‌గౌడ్ శిక్షణలో క్రికెట్‌లో రాణిస్తున్నా. పెవిలియన్ క్లబ్‌లో ఉదయం 5.30 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 10.30 గంటల వరకు ప్రాక్టిస్ చేస్తున్నా. బ్యాటింగ్, బౌలింగ్‌లో ప్రతిభ కనబరిచి ఆల్‌రౌండర్‌గా ఎదుగుతా. భవిష్యత్‌లో హైదరాబాద్ రంజీ జట్టుకు, ఇండియా జట్టుకు ఎంపికకావడమే లక్ష్యంగా పెట్టుకున్నా. అందుకోసం నిరంతరం శ్రమిస్తా. – సాయిరాం, క్రికెటర్, మహబూబ్‌నగర్
●


