ధాన్యం కొనుగోళ్లకు సన్నద్ధం | - | Sakshi
Sakshi News home page

ధాన్యం కొనుగోళ్లకు సన్నద్ధం

Mar 27 2026 9:58 AM | Updated on Mar 27 2026 9:58 AM

అధికారులు సమన్వయంతోపనిచేయాలి: కలెక్టర్‌ ఖుష్బూ గుప్తా

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: జిల్లాలో యాసంగి సీజన్‌ ధాన్యం కొనుగోళ్లకు యంత్రాంగం సన్నద్ధం కావాలని కలెక్టర్‌ ఖుష్బూగుప్తా ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో సంబంధిత అధికారులతో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆమె మాట్లాడారు. 2025– 26 యాసంగిలో 2.01 లక్షల ఎకరాల్లో వరి సాగైందన్నారు. 5.10లక్షల మెట్రిక్‌ టన్ను ల ధాన్యం ఉత్పత్తి అంచనా కాగా.. 2.50 లక్షల మెట్రిక్‌ టన్నుల వరకు ప్రభుత్వ కొ నుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈసారి జిల్లావ్యాప్తంగా ఐకేపీ, పీఏసీఎస్‌, డీసీఎంఎస్‌, హాకా ద్వారా 190 కొ నుగోలు కేంద్రాలను వచ్చే నెల రెండో వారంలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపా రు. కేంద్రాల్లో రైతులకు అవసరమైన అన్ని వసతులు కల్పించాలన్నారు. వరి పూర్తి పక్వానికి వచ్చిన తర్వాతే కోసేలా రైతులు, హార్వెస్టర్ల యజమానులకు అవగాహన కల్పించాలని సూచించారు. మిల్లులకు ధాన్యం కేటాయింపు, రవాణా ఏర్పాట్లు నిబంధనల ప్రకారమే జరగాలన్నారు. ముఖ్యంగా జిల్లా సరిహద్దులో చెక్‌పోస్టులు చేయాలని పోలీసులను ఆదేశించారు.

మిల్లర్లు సహకరించాలి..

వరిధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేందుకు మిల్లర్లు పూర్తి సహకారం అందించాలని కలెక్టర్‌ ఖుష్బూగుప్తా అన్నారు. కలెక్టరేట్‌లో జిల్లా రైస్‌మిల్లర్ల సంఘం సభ్యులతో నిర్వహించిన సమావేశంలో ఆ సంఘం అధ్యక్షుడు అశోక్‌ పలు సమస్యలను కలెక్టర్‌ దృష్టికి తీసుకొచ్చారు. యాసంగి ధాన్యంలో 75 శాతం బ్రోకెన్‌ పాడీగా ఉండటం వల్ల తాము నష్టపోతామని.. ప్రభుత్వం నిర్దేశించిన సివిల్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌) లక్ష్యాన్ని పూర్తిగా చేరుకోవడం కష్టసాధ్యమన్నారు. దీనిపై తమకు కొంత సడలింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అలాగే అందరికీ సమాన ప్రాధాన్యతతో ఫైన్‌, దొడ్డు రకం ధాన్యం కేటాయించాలని, పెండింగ్‌లో ఉన్న మిల్లింగ్‌ చార్జీలను చెల్లించాలని కోరారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ.. మిల్లర్ల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ధాన్యం అన్‌లోడింగ్‌ కోసం వాహనాలను 3–4 రోజులు నిలిపివేయకుండా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. మిల్లర్లు, అధికారులు సమన్వయంతో పనిచేసి లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. కాగా, జిల్లాలో 112 రైస్‌ మిల్లులు ఉండగా.. 84 మిల్లులకు సీఎంఆర్‌ కోసం ధాన్యం కేటాయిస్తున్నట్లు జిల్లా మేనేజర్‌ రవినాయక్‌ తెలిపారు. సమావేశంలో అడిషనల్‌ కలెక్టర్‌ జెఎల్‌బి హరిప్రియ, ఏఎస్పీ ఎన్‌బి రత్నం, డీసీఎస్‌ఓ గంప శ్రీనివా స్‌, డీఆర్డీఓ నర్సింహు లు, డీసీఓ కృష్ణ, జిల్లా సహకార ఆడిట్‌ అధికా రి టైటస్‌ పాల్‌, డీఏఓ బి.వెంకటేశ్‌, జిల్లా లీగ ల్‌ మెట్రాలజీ అధికారి రవీందర్‌, ఎల్‌డీఎం చంద్రశేఖర్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement