కొత్త గ్రూపులు ఏర్పాటు చేయాల్సిందే | - | Sakshi
Sakshi News home page

కొత్త గ్రూపులు ఏర్పాటు చేయాల్సిందే

Mar 27 2026 9:58 AM | Updated on Mar 27 2026 9:58 AM

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: ఈనెలాఖరు వరకు నగర పరిధిలో ఇంకా 227 కొత్త ఎస్‌హెచ్‌జీలను ఏర్పాటు చేయాలని ఇన్‌చార్జ్‌ స్థానిక సంస్థల అడిషనల్‌ కలెక్టర్‌ మధుసూదన్‌నాయక్‌ ఆదేశించారు. గురువారం మహబూబ్‌నగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కౌన్సిల్‌ సమావేశ మందిరంలో మెప్మా సీఓలు, ఆర్‌పీలతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరం (2025–26) లో కొత్తగా 377 మహిళా గ్రూపులను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్ణయిస్తే.. కేవలం 150 మాత్రమే చేయడమేమిటని మండిపడ్డారు. అలాగే కొత్తగా వీధి వ్యాపారులు 1,236కి గాను 743 మందినే చేర్పించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇందిరా మహిళా శక్తి కింద 130 యూనిట్లకు గాను 104 ఏర్పాటు చేస్తే ఎలా? అని ప్రశ్నించారు. మిగిలిన 24 యూనిట్లు సైతం మహిళలతో ఏర్పాటు చేయించాల్సిందేనన్నారు. సమావేశంలో మెప్మా పీడీ మహమ్మద్‌ యూసుఫ్‌, సీ్త్రనిధి ఆర్‌ఎం వేణుగోపాల్‌రెడ్డి, ఏఎంసీ అజ్మీర రాజన్న, ఇన్‌చార్జ్‌ డీఎంసీ ఎం.లక్ష్మి, సీఓలు యాదయ్య, వరలక్ష్మి, దేవమ్మ, నిర్మల తదితరులు పాల్గొన్నారు.

గురుకులాల్లో గ్రూప్‌–1 అధికారుల పర్యటన

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: గ్రూప్‌–1 అధికారులు శిక్షణలో భాగంగా శుక్రవారం స్థానిక టీజీఎంఆర్‌ఎస్‌జేసీ బాలుర–1, బాలుర–2, బాలికల–1 గురుకులాల్లో క్షేత్రస్థాయి పర్యటన చేశారు. 24 మంది అధికారులు ఈ మూడు గురుకులాల్లో పర్యటించారు. ఆర్‌ఎల్‌సీ ఖాజా బాహుద్దీన్‌ వారిని ఆహ్వానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement