జనరల్‌ ఆస్పత్రిలోని కుక్కల తరలింపు | - | Sakshi
Sakshi News home page

జనరల్‌ ఆస్పత్రిలోని కుక్కల తరలింపు

Mar 27 2026 9:58 AM | Updated on Mar 27 2026 9:58 AM

పాలమూరు: ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో ఏడుగురు బాధితులపై కుక్క దాడి ఘటనపై ఈనెల 24న సాక్షిలో ‘పిచ్చి కుక్కలు దొంగలు స్వైరవిహారం’ కథనం ప్రచురితమైంది. దీనిపై జనరల్‌ ఆస్పత్రి అధికారులతోపాటు కార్పొరేషన్‌ అధికారులు స్పందించారు. కార్పొరేషన్‌ అధికారులతో సమన్వయం చేసుకొని 24గంటలపాటు శ్రమించి గురువారం ఆస్పత్రి పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్న మూడు వీధికుక్కలను తరలించారు. రోగులతో పాటు వారివెంట వచ్చే అటెండర్ల భద్రతకు ప్రాధన్యత ఇస్తూ ఇలాంటి ఘటనలు మళ్లీ కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రంగా అజ్మీరా వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement