వైభవంగా సీతారామచంద్రస్వామి మాస కల్యాణం | - | Sakshi
Sakshi News home page

వైభవంగా సీతారామచంద్రస్వామి మాస కల్యాణం

Mar 27 2026 9:58 AM | Updated on Mar 27 2026 9:58 AM

నేడు సీతారాముల

కల్యాణోత్సవం

సిర్సనగండ్లలో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు

చారకొండ: అపర భద్రాద్రి సిర్సనగండ్ల సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలు గురువారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ముందుగా సిర్సనగండ్ల నుంచి భక్తులు, గ్రామస్తులు ఉత్సవ విగ్రహాలను పల్లకీలో ఊరేగింపుగా గుట్టపై నున్న ఆలయానికి తీసుకొచ్చారు. మధ్యాహ్నం 12 గంటలకు సీతారాములు మాస కల్యాణ ఘట్టం కనులపండువగా ప్రారంభమైంది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్య లో తరలి వచ్చి వేడుకను తిలకించారు. ఆలయ చైర్మన్‌ రామశర్మ, ఈఓ స్వర్గం అంజనేయులు, తహసీల్దార్‌ ఉమదంప తులు, ఎస్‌ఐ వీరబాబు దంపతులు, ఎంపీడీఓ శంకర్‌నాయక్‌, ఆలయ మాజీ చైర్మన్‌ మల్లికార్జున శర్మ, సర్పంచ్‌ రామస్వా మి దంపతులు, ఉప సర్పంచ్‌ కల్లు సురేందర్‌రెడ్డి దంపతులు కల్యా ణంలో కూర్చున్నారు. అనంతరం భక్తులకు సిర్సనగండ్లకు చెందిన పిన్నపురెడ్డి వెంకట్‌రెడ్డి అన్నదానం చేశారు.కార్యక్రమంలో మే నేజర్‌ నిరంజన్‌, అర్చకులు లక్ష్మణ్‌ శర్మ, వేణుశర్మ, కోదండ రామశర్మ, మురళీధర్‌శర్మ, గోపిశర్మ, ప్రవీణ్‌ శర్మ, అనంత రామశర్మ, , నాయకులు వెంకట్‌గౌడ్‌, బాల్‌రాంగౌడ్‌, సందీప్‌రెడ్డి, నర్సింహారెడ్డి,ప్రశాంత్‌ నాయక్‌, సాంబయ్యగౌడ్‌ ఉన్నారు.

పటిష్ట నిఘా..

ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఆలయ పరిసరాల్లో గట్టి బందోబస్తు, సీసీ నిఘా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎస్‌ఐ వీరబాబు తెలిపారు.

ప్రత్యేక బస్సులు

బ్రహ్మోత్సవాలకు మహబుబ్‌నగర్‌, నల్గొండ, హైదరాబాద్‌, రంగారెడ్డి ప్రాంతాల నుంచి తరలివచ్చే వేలాది మంది భక్తుల కోసం కల్వకుర్తి, అచ్చంపేట, దేవరకొండ ఆర్టీసీ డిపోల నుంచి ప్రత్యేక బస్సులు నడిపించనున్నారు.

ఉత్సవాలకు హాజరైన భక్తులు

శ్రీరామనవమి పురస్కరించుకొని శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు సీతారాముల కల్యాణ వేడుక నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ ప్రభుత్వం తరుఫున స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందించనున్నారు. వేడుకలో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎంపీ మల్లు రవి పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. వేడుకకు తిలకించేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ అధ్వర్యంలో చలువ పందిళ్లు, అవసరం అయిన చోట టెంట్లు, తాగునీరు, విద్యుత్‌ తదితర సౌకర్యాలు కల్పించారు. కల్యాణం మండపం ఎదురుగా సుమారు 10 వేల మంది కూర్చునేలా, కల్యాణ మండపం చుట్టూ 20 వేల మంది భక్తులు తిలకించేలా ఏర్పాట్లు చేశారు. వీఐపీల వాహనాల పార్కింగ్‌కు గట్టపై చదును చేశారు. వృద్ధులకు, మెట్ల నుంచి ఎక్కలేని వారి కోసం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గుట్టపైకి ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు చైర్మన్‌ డేరం రామశర్మ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement