ఐదో సారి పోటీలో.. | - | Sakshi
Sakshi News home page

ఐదో సారి పోటీలో..

Feb 4 2026 7:34 AM | Updated on Feb 4 2026 7:34 AM

ఐదో సారి పోటీలో..

ఐదో సారి పోటీలో..

వనపర్తి టౌన్‌: బీఆర్‌ఎస్‌కు చెందిన 33వ వార్డు అభ్యర్థి వాకిటి శ్రీధర్‌ 2000, 2005, 2014, 2020 సంవత్సరాల్లో వరుసగా కౌన్సిలర్‌గా విజయం సాధించారు. ఈ క్రమంలో ఆయన ఆయన బీఆర్‌ఎస్‌ తరుఫున బరిలో దిగారు. మరోసారి కూడా విజయం తననే వరిస్తుందని రాష్ట్రంలో వరుసగా అయిదు సార్లు గెలిచిన కౌన్సిలర్‌గా తనకు గుర్తింపు దక్కనుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

మాజీ కౌన్సిలర్లకు నో ఛాన్స్‌

వనపర్తి మున్సిపాలిటీలో మాజీ కౌన్సిలర్లకు కాంగ్రెస్‌ పార్టీ నుంచి బీ–ఫాం దక్కలేదు. రెండుసార్లు కౌన్సిలర్‌గా ఎన్నికై న భువనేశ్వరికి, ఓసారి కౌన్సిలర్‌గా గెలుపొందిన ఆమె భర్త నందిమల్ల శ్యాంకుమార్‌కు బీ–ఫాం కేటాయింపులో నిరాకరణ ఎదురైంది. 23వ, వార్డు అభ్యర్థిత్వం కోసం తీవ్రంగా ప్రయత్నించిన ఫలితం లేకపోయింది. దీంతో పాటు గత ఎన్నికల్లో టీడీపీ కౌన్సిలర్‌గా గెలిచిన ఏర్పుల లక్ష్మి కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో వచ్చినప్పటి నుంచి ఆ పార్టీని అంటిపెట్టుకొని ముందుకు సాగుతున్నారు ఆమెకు కూడా ఛాన్స్‌ దక్కలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement