
టెండర్లకు నేడే చివరి అవకాశం
● మద్యం దుకాణాలపై ఆసక్తి చూపనివ్యాపారులు
● చివరి రోజుపై ఆశలు పెట్టుకున్న ఎకై ్సజ్ అధికారులు
మహబూబ్‌నగర్ క్రైం: ఉమ్మడి జిల్లాలోని మద్యం దుకాణాలకు టెండర్ల స్వీకరణకు కేవలం 24గంటల సమయం మాత్రమే మిగిలింది. ప్రభుత్వం మద్యం దుకాణాలకు టెండర్లు వేసేందుకు మరోసారి అవకాశం కల్పించినా వ్యాపారులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. బుధవారం ఉమ్మడి జిల్లాలో 42 టెండర్లు మాత్రమే దాఖలయ్యాయి. గతంలో వచ్చిన టెండర్ల కంటే ఈ సారి పెంచాలని ఎకై ్సజ్ అధికారులు చేసిన ప్రయత్నాలు పూర్తిగా విఫలమయ్యాయి. ఇక ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో ఉన్న 227 ఏ–4 దుకాణాలకు 5,230 దరఖాస్తులు వచ్చాయి. గురువారం చివరి రోజు కావడంతో మరో 500 నుంచి 1000 టెండర్లు దాఖలు కావొచ్చని ఎకై ్సజ్ అధికారులు ఆశిస్తున్నారు.

టెండర్లకు నేడే చివరి అవకాశం