
కుక్కల స్వైరవిహారం.. 9 మందిపై దాడి
చారకొండ: మండలంలోని సిర్సనగండ్లలో వీధి కుక్కలు స్వైరవిహారం చేశా యి. బుధవారం దాదాపు 9 మందిని గా యపర్చడంతో గ్రామస్తులంతా భయాందోళనకు గురయ్యారు. పెద్దల పరిస్థితే ఇ లా ఉంటే.. చిన్నారులు, పిల్లల పరిస్థితి ఏంటి అని, ఇప్పటికై నా పంచాయతీ అధి కారులు స్పందించి తగు చర్యలు చేప ట్టాలని గ్రామస్తులు కోరారు. పూర్తి వివరాలిలా.. బుధవారం మధ్యాహ్నం ఓ వీ ధి కుక్కల గుంపు గ్రామంలో కనిపించిన వారందరిపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చింది. ఈక్రమంలో పగడాల శ్రీను, కు మ్మరి లక్ష్మమ్మ, గ్యార లక్ష్మమ్మ, ఒట్టే లక్ష్మ మ్మ, మరో మహిళ, ముగ్గురు చిన్నారులు గాయపడగా.. వీరందరూ కల్వకుర్తి ప్ర భుత్వ ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందారు. ముగ్గురికి తీవ్రగాయాలు కావడంతో వారికి అక్కడే వైద్యం అందిస్తున్నారు. ఇదిలాఉండగా, సిర్సనగండ్లలో వీధికుక్క ల బెడద తీవ్రంగా ఉందని, చిన్నారులు, పిల్లలను బడికి పంపాలన్నా, వృద్ధులు ఆరుబయట కూర్చోవాలన్నా ఎక్కడి నుంచి కుక్కలు వచ్చి దాడి చేస్తాయోనని భయపడే పరిస్థితి నెలకొందన్నారు. ఇప్పటికై నా పంచాయతీ శాఖ అధికారులు స్పందించి వీధికుక్కల బెడద తీర్చాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.