
పాలమూరు వాసి సాహసయాత్ర
స్టేషన్ మహబూబ్‌నగర్: జిల్లా కేంద్రం బోయపల్లి వార్డుకు చెందిన మునిమంద మల్లేశ్‌గౌడ్ అరుదైన ఘనతను సాధించాడు. దేశంలోని 12 జ్యోతిర్లింగాలను దర్శనం చేసుకోవడానికి సైకిల్‌పై సాహసయాత్ర చేయడానికి గతేడాది అక్టోబర్ 17వ తేదీన శ్రీకారం చుట్టాడు. బోయపల్లి మీదుగా సైకిల్‌యా త్ర చేపట్టి తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, బీహార్‌లోని రక్సౌల్ బార్డర్ మీదుగా నేపాల్ చేరుకున్నా డు. అక్కడ 45రోజులపాటు సైకిల్‌పై తిరిగి అక్కడి నయాపూల్ ప్రాంతం నుంచి ట్రెక్కింగ్ చేసుకుంటూ 4,130 మీటర్ల ఎత్తుగల అన్నపూర్ణ బేస్‌క్యాంప్‌కు చేరాడు.
12 జ్యోతిర్లింగాలు..
18 వేల కిలోమీటర్లు
367రోజులు 14 రాష్ట్రాలు,
నేపాల్‌లో మల్లేశ్‌గౌడ్ సైక్లింగ్
యాత్ర పూర్తిచేసుకొని స్వస్థలానికి
చేరుకొన్న యువకుడు
367 రోజుల పాటు..
మల్లేశ్‌గౌడ్ 367 రోజులపాటు సుదీర్ఘంగా సైకిల్‌యాత్ర చేపట్టారు. మొదటి నుంచి ఫిట్‌నెస్‌పై మంచి అవగాహన ఉన్న మల్లేశ్‌గౌడ్ ఈ యాత్రలో ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా 18వేల కిలమీటర్ల యాత్రను పూర్తిచేశాడు. ప్రతిరోజూ పక్కా ప్రణాళికతో యాత్ర చేశారు. ఉదయం 8 గంటల నుంచి 11గంటల వరకు, మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు యాత్ర చేపట్టారు. ప్రతిరోజూ దాదాపు 90 నుంచి 100 కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేశారు.
పాలమూరులో ఘనస్వాగతం
18వేల కిలోమీటర్ల యాత్ర పూర్తి చేసుకొని ఈనెల 19వ తేదీన పాలమూరు నగరానికి చేరుకున్న మల్లేశ్‌గౌడ్‌ను పలువురు ఘనంగా స్వాగతం పలి కారు. జిల్లా కేంద్రంతోపాటు బోయపల్లిలో పలువురు పూలమాలలు, శాలువాలతో సత్కరించారు.