
భవనం పైనుంచి పడి వ్యకి మృతి
నాగర్‌కర్నూల్ క్రైం: ప్రమాదవశాత్తు భవనంపై నుంచి కిందపడి ఓ కార్మికుడు మృతిచెందిన ఘటన జిల్లా కేంద్రంలోని ఎర్రగడ్డకాలనీలో చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్‌ఐ గోవర్ధన్ తెలిపిన వివరాలిలా.. జిల్లా కేంద్రానికి చెందిన పాలమూరు శ్రీనివాసులు (55) మేస్త్రి పని చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో మంగళవారం ఎర్రగడ్డకాలనీలో ఓ ఇంటి నిర్మాణ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు శ్రీనివాసులు భవనంపై నుంచి కిందపడడంతో తీవ్రగాయాలయ్యాయి. గమనించిన తోటి కూలీలు వెంటనే చికిత్స నిమిత్తం జనరల్ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు రెఫర్ చేశారు. తరలిస్తుండగా మార్గమద్యలో మృతిచెందడటంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన బుధవారం వెలుగులోకి రాగా.. సంఘటనకు సంబందించి మృతుడి కుమారుడు ఆంజనేయులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
చేపలు పట్టేందుకు వెళ్లి..
ఊట్కూరు: ఊట్కూరులో వాగులో ప్రమాదవశాత్తు ముకేష్‌జోహన్ కొటారె(30) పడి మృతి చెందిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. మహారాష్ట్రలోని పూణె జిల్లాకు చెందిన ముకేష్‌జోహన్ కొటారె ఊట్కూరు గ్రామ శివారులో కూలీ పనిచేస్తూ జీవిస్తున్నాడు. రెండు రోజుల క్రితం చెరువు కిందగల వాగులోకి చేపలు పట్టేందుకు వెళ్లా డు. ఆయన తిరిగి రాకపోవడంతో చుట్టు పక్క ల ప్రాంతాలలో ఆయన ఆచూకీ కోసం వెతికా రు. బుధవారం ఉదయం వాగులోని నీటి గుంతలో మృతదేహం ఉండడంతో రైతులు గమ నించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల సహాయంతో కూలీలు అక్కడకు వెళ్లి మృతదేహాన్ని గుర్తించారు. అతని తాత ఖాళ్ళురాం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రమేష్ తెలిపారు.
విద్యుదాఘాతానికి
యువకుడు బలి
నవాబుపేట: కొబ్బరి చెట్లు తరలిస్తూ విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందిన ఘటన మండంలోని దయాపంతులపల్లిలో చో టుచేసుకుంది. మండలంలోని యన్మన్‌గండ్లకు చెందిన యువకుడు జగదీశ్(30) తన బొలేరోలో కొబ్బరి చెట్లను తీసుకొచ్చి రైతుల పొలాల్లో దించుతుండగా..ప్రమాదవశాత్తు చెట్లకు విద్యు త్ వైర్లు తగిలి షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా అక్కడే కింద ఉండి చెట్లు అందుకుంటున్న మరో ముగ్గురు రైతులు స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. జగదీశ్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ట్రాక్టర్ పైనుంచి పడి
వ్యక్తి మృతి
పాన్‌గల్: ట్రాక్టర్ ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందిన సంఘటన బుధవారం మండలంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపి న వివరాల ప్రకారం.. మండలంలోని రేమద్దుల గ్రామానికి చెందిన గొల్లకుంట లక్ష్మ య్య(79) ఈనెల 17న గ్రామం నుంచి మండల కేంద్రం పాన్‌గల్‌కు సబ్సిడీ వేరుశనగ విత్తనాల కోసం ట్రాక్టర్‌పై వెళ్తుండగా, గోప్లాపూర్ గ్రామ శివారులోని డంపింగ్ యార్డు సమీపంలో మలుపు వద్ద ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తాపడింది. ట్రాక్టర్ ఇంజిన్‌పై కూర్చున్న గొల్లకుంట లక్ష్మయ్య కిందపడటంతో ట్రాక్టర్ ట్రాలీ టైర్ అతని మీదనుంచి వెళ్లింది. దీంతో కాళ్లకు, ఛాతికి తీవ్ర గాయాలయ్యా యి. వెంటనే చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి హైదరాబాద్ మెడిటెక్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు. ట్రాక్టర్ డ్రైవర్ గొల్లకుంట రాములు అతివేగంగా, అజాగ్రత్తగా నడిపి లక్ష్మయ్య మృతి చెందాడని, డ్రైవర్‌పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాల ని లక్ష్మయ్య కుమారుడు గోవర్ధన్ బుధవారం ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
జగదీశ్(ఫైల్)

భవనం పైనుంచి పడి వ్యకి మృతి