
అమరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకోవాలి
ఎర్రవల్లి: ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తూ అమరులైన పోలీసుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని పదో పటాలం కమాండెంట్ జయరాజు అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాలను పురస్కరించుకొని బుధవారం బీచుపల్లి పదో పటాలంలో పోలీస్ బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి కమాండెంట్ హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎర్రవల్లి కూడలిలోని పుర వీధుల గుండా పటాలం అధికారులు, సిబ్బందితో కలిసి బైక్ ర్యాలీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజా రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణలో నిబద్దతతో విధి నిర్వహణ చేస్తూ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ముందుకు సాగుతున్న పోలీసుల కృషి ఎంతో అభినందనీయమన్నారు. అనంతరం ఎర్రవల్లి కూడలి నుంచి బైక్‌లతో ర్యాలీగా గద్వాల జిల్లా కేంద్రానికి తరలివెళ్లారు. కార్యక్రమంలో ఆర్‌ఐలు, ఆర్‌ఎస్సైలు, సిబ్బంది, తదితరులు ఉన్నారు.
పదో పటాలం కమాండెంట్ జయరాజు