
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
కృష్ణా: మండల కేంద్రంలోని రైల్వేస్టేషన్‌లో ఈ నెల 19న రాత్రి 11 గంట ల సమయంలో ట్రె యిన్ నుంచి కిందపడిన గుర్తు తెలియని వ్యక్తికి గాయా లు కాగా, రైల్వే పోలీసులు అతడిని చికిత్స నిమిత్తం రాయచూర్‌లోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. బుధవారం మధ్యాహ్నం చికిత్సపొందుతూ ఆ వ్యక్తి మృతి చెందాడు. ఆ వ్యక్తి వివరాలు ఇప్పటివరకు తెలియ లేదని, ఘటనపై కేసు నమోదు చేసి దర్యా ప్తు చేస్తున్నట్లు కానిస్టేబుల్ మునిస్వామి తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో మరో వ్యక్తి
కల్వకుర్తి టౌన్: రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళ చికిత్స పొందుతూ మహిళ మృతి చెందిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ తెలిపిన వివరాలిలా.. మున్సిపాలిటీలోని సిలార్‌పల్లికి చెందిన స్వాతి (33), తన భర్త సైదులుతో కలిసి వెల్దండ నుంచి కల్వకుర్తి బైక్‌పై ఈ నెల 18న వెళ్తున్నారు. పట్టణ సమీపంలోకి రాగానే జింజర్ హోటల్ వద్దకు రాగానే బైక్ అదుపుతప్పి పడిపోయింది. ఘటనలో తీవ్రగాయాలైన స్వా తిని మెరుగైన చికిత్స కో సం హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. చికిత్స పొందుతూ బుధవారం ఆమె మృతి చెందినట్లు ఎస్‌ఐ మాధవరెడ్డి తెలిపారు. ఘటనపై స్వా తి సోదరుడు నరసింహ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు న మోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు. మృతురాలికి భర్తతో పాటుగా ముగ్గురు పిల్లలు ఉన్నారు.