
నేరుగా ఉల్లి విక్రయాలు
దేవరకద్ర: స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డుకు బుధవారం ఉల్లి తక్కువగా రావడంతో వ్యాపారులు వేలం నిర్వహించకుండా నేరుగా కొనుగోలు చేశారు. 50 కిలోల బస్తా గరిష్టంగా రూ.800, కనిష్టంగా రూ.600 ధర పలికింది. మార్కెట్‌కు వచ్చిన విత్తనాల ఉల్లికి డిమాండ్ ఉండటంతో 50 కిలోల బస్తా గరిష్టంగా రూ.1,300, కనిష్టంగా రూ.1,200 కు విక్రయించారు. వినియోగదారులు, చిరు వ్యాపారులే ఎక్కువగా ఉల్లి కొనుగోలు చేశారు.
ఇద్దరికి జైలుశిక్ష
కల్వకుర్తి టౌన్: రెండు వేర్వేరు కేసుల విచారణలో న్యాయమూర్తి ఇద్దరు నిందితులకు జైలుశిక్షతో పా టు అందులో ఒకరికి జరిమానా విధించినట్లు బుధ వారం ఎస్‌ఐ మాధవరెడ్డి తెలిపారు. పట్టణంలోని ఎన్జీఓ కాలనీకి చెందిన వరికుప్పల వెంకటేశ్ 2021 లో ఓ మహిళకు కల్లు తాగించి ఆటోలో తీసుకెళ్లి బంగారు ఆభరణాలు అపహరించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్‌ఐ మహేందర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పట్టణంలోని సీని యర్ సివిల్ కోర్టులో కేసును విచారించిన న్యాయమూర్తి కావ్య బుధవారం అతడికి ఆరునెలల జైలుశిక్షతో పాటు రూ.వెయ్యి జరిమానా విధించారు.
● 2018లో వంగూర్ మండలం జాజాలతండాకు చెందిన దాసును తెల్కపల్లి మండలం పెద్దూరుకు చెందిన జంగం రమేష్ బైక్‌తో ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడు దాసు ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్‌ఐ రవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బుధవారం కేసును విచారించిన సీనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి కావ్య నిందితుడికి 41 రోజుల జైలుశిక్ష విధించారు.