
మయూర వాహనంపై కురుమూర్తిరాయుడు
బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలిరోజు బుధవారం రాత్రి శ్రీదేవి, భూదేవి సమేతుడైన కురుమూర్తిస్వామిని మయూర వాహనంపై కురుమూర్తి కొండల్లో ఊరేగించారు. పల్లకీలో ఉత్సవమూర్తులను ఆశీనులను చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించి, గోవింద నామస్మరణల మధ్య ఉద్దాల మండలం వరకు తీసుకొచ్చి.. తిరిగి ఆలయానికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ మధనేశ్వరెడ్డి, పాలకమండలి చైర్మన్ గోవర్ధన్‌రెడ్డి, భక్తులు పాల్గొన్నారు. – చిన్నచింతకుంట