
‘స్వచ్ఛత’ ప్రతి ఒక్కరి బాధ్యత
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: జిల్లాకేంద్రంలోని రైల్వేస్టేషన్, బస్‌స్టాండ్, తదితర ప్రాంతాల్లో పీయూ ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు స్వచ్ఛతా కార్యక్రమాన్ని చేపట్టారు. ఆయా పరిసర ప్రాంతాల్లో చెత్తను ఏరివేసి, పిచ్చిమొక్కలను తొలగించారు. ఈ సందర్భంగా ఎన్‌ఎస్‌ఎస్ రీజినల్ డైరెక్టర్ సంజయ్‌కుమార్ మాట్లాడుతూ సమాజంలో స్వచ్ఛత విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా మెలగాలని, ఎక్కడబడితే అక్కడ అక్కడ బహిరంగ ప్రదేశాల్లో చెత్తా చెదారం వేయకూడదన్నారు. ఇళ్ల వద్ద వెలువడిన తడి, పొడి చెత్తను వేర్వేరుగా కవర్లలో కట్టి కట్టి డంపింగ్ యార్డుకు పంపించడం వల్ల పర్యావరణానికి నష్టం జరగకుండా ఉంటుందన్నారు. బహిరంగ ప్రదేశాల్లో నాటికల ద్వారా పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ పీయూ కోఆర్టినేటర్ ప్రవీణ, ప్రోగ్రాం అధికారులు అర్జున్‌కుమార్, గాలెన్న, రవికుమార్, ఈశ్వర్, రాఘవేందర్, శివకుమార్‌సింగ్, ఇమానియేల్ పాల్గొన్నారు.