
నిఘా అవసరం
చెక్‌పోస్టులను తొలగించడం వల్ల దూర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు ఎక్కువసేపు నిలిచే అవకాశం ఉండదు. ఇదే అదనుగా ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ రవాణా జరగడానికి ఆస్కారం ఉంది. ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఏపీ, కర్ణాటక రాష్ట్రాలు సరిహద్దులుగా ఉండటంతో అక్రమ గోవుల తరలింపు, గంజాయి, మద్యం, కలప, ఇసుక ధాన్యాలు వంటి అక్రమ వ్యాపారాలకు అవకాశం కలుగుతుంది. ప్రభుత్వం రాష్ట్రంలో సన్న వడ్లకు బోనస్ ఇస్తోంది. ఈ సమయంలో ఆయా రాష్ట్రాల నుంచి దళారులు జిల్లాకు వడ్లను తీసుకొచ్చి విక్రయాలు చేసే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో అధికారులు నిఘా తీవ్రతరం చేసి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం చాలా ఉంటుంది.