
జోరుగా ఉల్లి వ్యాపారం
● గరిష్టంగా రూ.1,800,
కనిష్టంగా రూ.1,100
దేవరకద్ర: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం ఉల్లి వ్యాపారం జోరుగా సాగింది. వివిధ గ్రామాల నుంచి రైతులు వేయి బస్తాల వరకు ఉల్లిని అమ్మకానికి తెచ్చారు. స్థానిక వ్యాపారులతో పాటు ఇతర ప్రాంతాల వ్యాపారులు వేలంలో పాల్గొన్నారు. పోటాపోటీగా జరిగిన వేలంలో నాణ్యమైన ఉల్లి ధర క్వింటాల్‌కు గరిష్టంగా రూ.1,800 పలకగా.. కనిష్టంగా రూ.1,100 ధర వచ్చింది. గత వారం కంటే ధరలు స్వల్పంగా పెరిగాయి. 50 కిలో ఉల్లి బస్తా గరిష్టంగా రూ.900, కనిష్టంగా రూ.550, మధ్యస్తంగా రూ.700 చొప్పున విక్రయించారు.
ఆర్‌ఎన్‌ఆర్ క్వింటాల్ రూ.2,009
దేవరకద్ర మార్కెట్ యార్డులో బుధవారం జరిగిన ఈనామ్ టెండర్లలో ఆర్‌ఎన్‌ఆర్ ధాన్యం ధర క్వింటాల్‌కు గరిష్టంగా రూ.2009 ఒకే ధర లభించింది. హంస ధాన్యం గరిష్టంగా రూ.1,719, కనిష్టంగా రూ.1,629 ధరలు నమోదయ్యాయి.