
వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో వార్షిక పరీక్షలు
స్టేషన్ మహబూబ్‌నగర్: జిల్లాకేంద్రంలోని వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో వివిధ స్వయం ఉపాధి కోర్సుల్లో శిక్షణ పొందిన 17వ బ్యాచ్ 150 మంది అభ్యర్థులకు హైదరాబాద్ సెట్విన్ ఆధ్వర్యంలో బుధవారం వార్షిక పరీక్షలు నిర్వహించారు. ఉద యం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు థియరీ, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రాక్టికల్ పరీక్షలు కొనసాగాయి. పరీక్షలను జిల్లా యువజన, క్రీడల అధికారి ఎస్.శ్రీనివాస్, ఇతర అధికారులు సందర్శించారు. ఈ సందర్భంగా డీవైఎస్‌ఓ మాట్లాడుతూ 17వ బ్యాచ్‌కు సంబంధించి జూన్ 1 నుంచి ఆగస్టు 31 వరకు 150 మంది నిరుద్యోగ యువతకు వివిధ స్వయం ఉపాధి కోర్సుల్లో శిక్షణ అందజేసినట్లు వివరించారు. ఉత్తీర్ణులైన అభ్యర్థులకు సెట్విన్ వారిచే సర్టిఫికెట్లు అందజేస్తామన్నారు. కేంద్రంలో శిక్షణ పొందిన అభ్యర్థులకు ఫలితాల అనంతరం జాబ్‌మేళా నిర్వహించి ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగావకాశాలు కల్పించడానికి తగిన చర్య లు తీసుకుంటామని చెప్పారు. వార్షిక పరీక్షలను హైదరాబాద్ సెట్విన్ కోఆర్డినేటర్, పరీక్షల పరిశీలకుడు సత్యనారాయణరెడ్డి, మహ్మద్ షేక్ ఇస్మాయి ల్, అజీమ్ ఎజాజ్ పర్యవేక్షించారు. కార్యక్రమంలో డీవైఎస్‌ఓ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ రవీందర్‌రెడ్డి, ఫ్యాకల్టీ హరిప్రసాద్, కౌసల్య, సువర్ణ, ఖలీల్, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.