
దేశ ఆర్థిక ప్రగతిలో మోదీ పాత్ర కీలకం
పాలమూరు: దేశ ప్రగతి కోసం నిస్వార్థంగా పాటుపడుతున్న గొప్ప నాయకుడు ప్రధానమంత్రి నరేంద్రమోదీ అని ఎంపీ డీకే అరుణ అన్నారు. ప్రధాని మోదీ 75వ పుట్టిన రోజును పురస్కరించుకొని బుధవారం జిల్లా పార్టీ కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జనరల్ ఆస్పత్రి బ్లడ్ బ్యాంకు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎంపీ ప్రారంభించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ మోదీ మూడోసారి ప్రధానిగా ఎన్నికై దేశ చరిత్రలో నిలిచిపోయారని తెలిపారు. దేశాన్ని ప్రపంచంలోనే ఆర్థికంగా మొదటి స్థానంలో నిలబెట్టేందుకు వికసిత్ భారత్ సకల్పంతో ముందుకు సాగుతున్న గొప్ప నాయకుడు అని కొనియాడారు. అనంతరం జిల్లాకేంద్రంలోని భగీరథకాలనీ, కొత్త గంజిలలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాలను ఎంపీ ప్రారంభించారు.
● జిల్లా బీజేపీ కార్యాలయంలో బుధవారం తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ హాజరై మాట్లాడారు. తెలంగాణలో నిజాం పాలన లో రజాకార్లు మహిళలను, ప్రజలను ఎంతో ఘో రంగా అవమానాలకు గురిచేశారని అలాంటి అరా చకాలకు చరమగీతం పాడటం గొప్ప విషయం అన్నారు. నిజాం సర్కార్ నుంచి విముక్తి పొందిన సందర్భంగా ప్రజలు వేడుకలు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు పద్మజారెడ్డి, బాలరాజు, పాండురంగారెడ్డి పాల్గొన్నారు.