
యోగా పోటీల్లో 5 పతకాలు
మహబూబ్‌నగర్ క్రీడలు: నిర్మల్‌లో ఈనెల 5 నుంచి ఆదివారం ముగిసిన రాష్ట్రస్థాయి యోగాసన స్పోర్ట్స్ చాంపియన్‌షిప్‌లో జిల్లా క్రీడాకారులు ప్రతిభచాటి పతకాలు సాధించినట్లు జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు కె.సురేష్, ప్రధాన కార్యదర్శి కె.సాయికుమార్, కోశాధికారి యూ.సురేష్ తెలిపారు. సబ్ జూనియర్, జూనియర్ క్రీడాకారులు బి.కవిత ఓ బంగారం, కాంస్య పతకాలు, కీర్తనారెడ్డి బంగారు, రజతం, సుప్రజ కాంస్య పతకం సాధించగా కె.సృజన నాలుగో స్థానం నిలిచినట్లు తెలిపారు. వీరికి కోచ్‌గా ఉన్న సాయికుమార్‌ను వారు అభినందించారు.