
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
● డివైడర్‌ను బైక్ ఢీకొట్టడంతో..
జడ్చర్ల: గణేశ్ నిమజ్జన ఉత్సవంలో పాల్గొని తిరిగి వెళ్తున్న క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందగా మరొకరు గాయపడిన ఘటన పట్టణంలో శుక్రవారం రాత్రి చోటు చోసుకుంది. సీఐ కమలాకర్ కథనం మేరకు.. దేపల్లి త్రిశూల్‌నగర్‌కు చెందిన ప్రమోద్(24) మిత్రుడు ప్రభుకుమార్‌తో కలిసి బైక్‌పై నిమజ్జనంలో పాల్గొని సిగ్నల్‌గడ్డ వైపు నుంచి కొత్త బస్టాండ్ వైపు వెళ్తున్న క్రమంలో చర్చి సమీపంలోని మలుపు వద్ద అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టాడు. ప్రమాదంలో ప్రమోద్ తలకు తీవ్రగాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక కూర్చున్న ప్రభుకుమార్ గాయపడ్డాడు. ఒక్కగానొక్క కుమారుడు ప్రమోద్ మృతితో తల్లిదండ్రులు సావిత్రి, యాదయ్య కన్నీరు మున్నీరయ్యారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
కేఎల్‌ఐ కాల్వలో
పడి వృద్ధుడి మృతి
నాగర్‌కర్నూల్ క్రైం: మతిస్థిమితం లేని వృద్దుడు కెఎల్‌ఐ కాల్వలో పడి మృతి చెందిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ గోవర్ధన్ తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీపురం గ్రామానికి చెందిన గునగంటి బొజ్జయ్య (65)కు మతిస్థిమితం సరిగ్గా లేదు. గత నెల 28న కుటుంబసభ్యులు పొలం వద్దకు వెళ్లారు. ఆ సమయంలో బొజ్జయ్య ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఆయన కోసం ఎక్కడ వెతికినా ఆచూకీ లభించలేదు. శనివారం శ్రీపురం గ్రామంలోని కేఎల్‌ఐ కాల్వలో మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనరల్ ఆస్పత్రికి తరలించారు. అతని కుమారుడు ఆంజనేయులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
కోతుల దాడిలో
వృద్ధురాలికి గాయాలు
తిమ్మాజిపట: వృద్ధురాలిపై కోతులు దాడి చేసిన ఘటన మండల పరిధిలోని చేగుంట గ్రామంలో శనివారం జరిగింది. గడ్డం బాలక్రిష్ణమ్మ అనే వృద్ధురాలు శనివారం ఇంట్లో వంట చేసుకుంటుండగా కోతుల గుంపు ఇంట్లోకి దూరి ఆమైపె దాడి చేసింది. మెడ, వీపు, కాళ్లు, చేతులపై కరువగా కేకలు వేయడంతో భర్త మైబు కర్ర తీసుకురావడంతో కోతులు పారిపోయాయి. బాలక్రిష్ణమ్మ వెంటనే బిజినపల్లి ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. కోతుల బెడద ఎక్కువ కావడంతో తీవ్ర అవస్థలు పడుతున్నామని అటవీశాఖ అధికారులు స్పందించి కోతుల నుంచి తమను రక్షణ కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
ఊరేగింపులో ఘర్షణ
ధరూరు: గణేశ్ నిమజ్జన ఊరేగింపులో జరిగిన ఘర్షణలో యువకుడు గాయపడిన ఘటన మండల పరిధిలోని ద్యాగదొడ్డిలో చోటు చేసుకుంది. పూర్తి వివరాలు.. గ్రామానికి చెందిన యువకులు శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో గణేశ్ నిమజ్జనం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో డీజే కోసం కిరాయికి తీసుకొచ్చిన బొలెరో డ్రైవర్ చంద్రశేఖర్ ముఖ్య కూడలి వద్ద వాహనం నిలిపి వాహనంలోనే నిద్రకు ఉపక్రమించాడు. నిద్రిస్తున్న డ్రైవర్‌ను డ్యాన్స్ చేయాలని యువకులు బలవంతం చేశారు. ఈ నేపథ్యంలో మాటామాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది. ఘర్షణలో డ్రైవర్ చంద్రశేఖర్‌కు తలకు గాయాలయ్యాయి. మద్యం మత్తులో ఉన్న ముగ్గురు యువకులు దాడి చేసినట్లు బాధితుడు తెలిపారు. శనివారం రేవులపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నాడు.

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం