
ఉత్కంఠగా బ్యాడ్మింటన్ పోటీలు
● సింగిల్స్, డబుల్స్, మిక్స్‌డ్‌లో సెమీస్ మ్యాచ్‌లు
● నేటితో ముగియనున్న టోర్నీ
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లా కేంద్రంలోని మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న 11వ రాష్ట్రస్థాయి జూనియర్ (అండర్–13) బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ ఉత్కంఠగా కొనసాగుతోంది. అకాడమీ క్రీడాకారుల మధ్య పోటీ రసవత్తరంగా సాగింది. క్వార్టర్, సెమీ ఫైనల్ మ్యాచ్‌లు హోరాహోరీగా సాగాయి.
హోరాహోరీగా సెమీస్
శనివారం బాలుర, బాలికల విభాగం సింగిల్స్, డబుల్స్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లు హోరాహోరీగా సాగాయి. బాలుర సింగిల్స్ మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో పబ్బు శివాన్ష్ (మేడ్చల్– మల్కాజ్‌గిరి) 15–11, 15–10 సెట్ల తేడాతో అద్వాత్ సత్తు (వికారాబాద్)పై, రెండో సెమీస్‌లో కంజుల జస్ప్రీత్ (వరంగల్) 15–9, 15–11 సెట్ల తేడాతో రామ్‌చరణ్ తేజ ఆకుల (మేడ్చల్ మల్కాజ్‌గిరి)పై, బాలికల సింగిల్స్ మొదటి సెమీ ఫైనల్‌లో నిమ్మ శాన్వి (సంగారెడ్డి) 15–10, 15–12 పాయింట్ల తేడాతో దియా ఆనంద్ (వికారాబాద్)పై, రెండో సెమీస్‌లో అనుముల శ్రీవైభవి(నిజామాబాద్) 15–11, 8–15, 15–11 పాయింట్ల తేడాతో మనస్విని భూక్య (వరంగల్)పై గెలుపొంది ఫైనల్‌కు చేరుకున్నారు.
డబుల్స్‌లో సెమీఫైనల్ మ్యాచ్‌లు
బాలుర డబుల్స్ విభాగం మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో కార్తికేయ మహర్షి (రంగారెడ్డి), శివాన్ష్ (మేడ్చల్, మల్కాజ్‌గిరి) 16–14, 15–12 సెట్ల తేడాతో అద్వైత్ సత్తు– సుహిత్‌యాదవ్ (వికారాబాద్)పై, రెండో సెమీస్‌లో రామ్‌చరణ్‌తేజ (మేడ్చల్, మల్కాజ్‌గిరి)– శౌర్యప్రతాప్‌సింగ్ (మేడ్చల్, మల్కాజ్‌గిరి) 15–12, 15–5 సెట్ల తేడాతో అభిషిక్త్ (కరీంనగర్)– కంజుల జస్ప్రీత్(వరంగల్)పై, బాలికల డబుల్స్ విభాగం మొదటి సెమీ ఫైనల్‌లో అభాజాదవ్ (రంగారెడ్డి)– దియా ఆనంద్ (వికారాబాద్) 17–15, 15–7 పాయింట్ల తేడాతో భూషణ్ త్రినితి (వికారాబాద్)– గాదె అన్విరెడ్డి (సూర్యాపేట)పై, రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో దీక్ష సహస్ర బండ (మహబూబ్‌నగర్)– నిమ్మ శాన్వి(సంగారెడ్డి) 8–15, 15–13, 12–15 తేడాతో ల్యోష కోరుకొండ (వికారాబాద్)– మనస్విని భూక్య (వరంగల్)పై గెలుపొంది ఫైనల్‌కు చేరుకున్నారు.