
డిండి కెనాల్‌లో బాలయ్య తల లభ్యం
కల్వకుర్తి టౌన్: కొడుకు చేతిలో హత్యకు గురైన బాలయ్య తల హత్య చేసిన మూడు రోజులకు లభ్యమైంది. శుక్రవారం రాత్రి సమయంలో అతని మృతదేహం లభ్యం కాగా, శరీరానికి తల లేకపోవటంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఉప్పునుంతల మండలం కొరటికల్ వద్ద వాగులో లభ్యమైన మృతదేహాన్ని శుక్రవారం అర్థరాత్రి పట్టణంలోని సీహెచ్‌సీకి తరలించి, అక్కడే మార్చూరీలో ఉంచారు. తల కోసం గాలిస్తున్న పోలీసులకు వంగూర్ మండలం డిండి చింతపల్లి వద్ద గజ ఈతగాళ్లతో వెతుకుతుండగా, అక్కడే ఉన్న ఓ సబ్‌కెనాల్‌లో తల లభ్యమైనట్లుగా పోలీసులు తెలిపారు. తలను గుర్తించి దానిని సీహెచ్‌సీ మార్చూరీకి తరలించి, వైద్యుల సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. హత్యకు సంబంధించి ఆదివారం పోలీస్‌స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించనున్నట్లు సమాచారం.
మాజీ ఎమ్మెల్యే పరామర్శ
బాలయ్య కుటుంబాన్ని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ పట్టణంలోని సీహెచ్‌సీలో పరామర్శించారు. అనంతరం వైద్యులతో మాట్లాడి తదుపరి చర్యలపై ఆరా తీశారు.