యథేచ్ఛగా వసూళ్ల దందా? | - | Sakshi
Sakshi News home page

యథేచ్ఛగా వసూళ్ల దందా?

Sep 7 2025 9:28 AM | Updated on Sep 7 2025 9:28 AM

యథేచ్

యథేచ్ఛగా వసూళ్ల దందా?

సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో మారని తీరు

ప్రతి పనికి ఓ రేటు

దస్తావేజు లేఖరుల కనుసన్నల్లోనే..

ఏసీబీ దాడులు జరుగుతున్నా.. మారని వైనం

డాక్యుమెంట్‌ రైటర్లే

దళారులుగా మారి..?

ఉమ్మడి జిల్లాలో 12 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఉన్నాయి. ఆయా కార్యాలయాల వద్ద డాక్యుమెంట్‌ రైటర్లు పెద్దఎత్తున దుకాణాలు తెరిచారు. వీరిలో చాలామంది అధికారులు, క్రయ విక్రయదారులకు దళారులుగా మారి అక్రమ వసూళ్లకు తెర లేపారు. పబ్లిక్‌ డాటా ఎంట్రీ ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ విధానం అమలులో ఉన్నప్పటికీ పాత పద్ధతిలోనే డాక్యుమెంట్‌ రైటర్ల ద్వారానే రిజిస్ట్రేషన్లు సాగుతున్నాయంటేనే క్రయ విక్రయదారులు ఎంత దోపిడీకి గురవుతున్నారో అర్థం చేసుకోవచ్చు. కొందరు సబ్‌ రిజిస్ట్రార్లు కొందరు డాక్యుమెంట్‌ రైటర్లకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తూ వారి ద్వారానే లావాదేవీలు కొనసాగిస్తున్నట్లు బాహాటంగా మాట్లాడుకుంటున్నారు.

మెట్టుగడ్డ: ఉమ్మడి జిల్లాలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ప్రతి పనికి ఓ రేటు నిర్ణయించి డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనల ప్రకారం అన్ని పత్రాలున్నా.. పైసలివ్వనిదే పని కావడం లేదు. డాక్యుమెంట్‌ ఛార్జీలతో పాటు కార్యాలయంలో ఇవ్వాలంటూ దస్తావేజు లేఖరులు అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారు. సాధారణంగా గ్రామకంఠం భూములకు సర్వేనంబర్లు ఉండవు. అసెస్‌మెంట్‌ నంబరు, గ్రామపంచాయతీలో చెల్లించిన పన్ను రసీదు చూపితే రిజిస్ట్రేషన్‌ చేయాలి. తండ్రి నుంచి కుమారుడికి, భర్త నుంచి భార్యకు గిఫ్ట్‌ డీడ్‌ డాక్యుమెంట్లు వచ్చినప్పుడు ఇష్టారీతిన డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. నాలా అయితే ఒక రేటు, అపార్ట్‌మెంట్‌, ఇళ్లు అయితే మరోరేటు.. ఇలా ప్రతి పనికి ఓ రేటు నిర్ణయించి దండుకున్నట్లు ఆరోపణలున్నాయి.

ఏసీబీ దాడులు జరుగుతున్నా..

జిల్లాలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో అవినీతికి అడ్డు లేకుండా పోయింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్యాలయాలపై ఓ పక్క ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నా అధికారులు మాత్రం పట్టనట్లుగా వ్యవహరిస్తుండటం విశేషం. ఫిర్యాదులతో జిల్లాలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలపై ఏసీబీ అధికారులు దాడులు ప్రారంభించగా.. దళారులను పెట్టుకొని దోపిడీ కొనసాగిస్తున్నారు. తాజాగా జిల్లాలోని ఓ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో దళారుల వద్ద దొరికిన అదనపు సొమ్ములే ఇందుకు నిదర్శనం. అవసరాలను ఆసరా చేసుకొని క్రయ విక్రయదారుల జేబులను గుల్ల చేస్తున్నారు. గత ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌ విధానం అమలు చేయడంతో అనధికార ప్లాట్ల రిజిస్ట్రేషన్లకు బ్రేక్‌ పడినట్లయింది. కానీ దీన్ని ఆసరా చేసుకొని కొందరు సబ్‌–రిజిస్ట్రార్లు ఇష్టారాజ్యంగా జీపీ లే అవుట్ల(అనధికార ప్లాట్లు)లో రిజిస్ట్రేషన్లు చేసినట్లు తెలియడంతో మరోసారి ఏసీబీ అధికారులు కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది.

ఎలాంటి ఫిర్యాదులు లేవు..

ప్రజల నుంచి ప్రభుత్వ ఫీజు కంటే అదనంగా డబ్బులు వసూలు చేస్తే వారిపై చర్యలు తీసుకుంటాం. ఇప్పటి వరకు అలాంటి ఫిర్యాదులు అందలేదు. ఫిర్యాదుల స్వీకరణకు పెట్టె ఏర్పాటు చేశాం.. దానిలో వేయాలని సూచిస్తున్నాం. కార్యాలయాల్లో పనిచేసే అధికారులు, సిబ్బంది ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే చర్యలు తప్పవు. డాక్యుమెంట్‌ రైటర్లు డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. క్రయ విక్రయదారులు కార్యాలయాల్లో కానీ, ఎవరైనా డబ్బు అడిగితే నిర్భయంగా ఫిర్యాదు చేయవచ్చు. జిల్లాలోని అన్ని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేస్తాం. – డి.ఫణీందర్‌,

జిల్లా రిజిస్ట్రార్‌ (స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ)

కాసులు కురిపిస్తున్న ఈసీ, సీసీ..

ఆస్తుల లావాదేవీల్లో ఈసీ (ఎన్‌కంబెన్స్‌ సర్టిఫికేట్‌) కీలకం. ఈ ధ్రువపత్రం కోసం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. ఈసీ కావాలంటే ప్రభుత్వ ఫీజు కంటే అదనపు రుసుం చెల్లించాల్సిందే. మాన్యువల్‌ ఈసీ కావాలంటే అడిగినంతా ఇచ్చుకోవాల్సిందే. డాక్యుమెంట్ల సీసీ (సర్టిఫైడ్‌ కాపీ) కావాలంటే ప్రభుత్వ ఫీజు కంటే రూ.300 అదనపు డబ్బు చెల్లించాల్సిందే. వివాహ రిజిస్ట్రేషన్లకు సైతం ప్రభుత్వ ఫీజు కంటే అదనంగా రూ.600 అదనంగా వసూలు చేస్తున్నారన్నది బహిరంగ రహస్యమే. ప్రతి పనికి ప్రభుత్వానికి చెల్లించిన రుసుంతో పాటు అదనపు దోపిడీ పక్కాగా జరుగుతోంది.

యథేచ్ఛగా వసూళ్ల దందా? 1
1/2

యథేచ్ఛగా వసూళ్ల దందా?

యథేచ్ఛగా వసూళ్ల దందా? 2
2/2

యథేచ్ఛగా వసూళ్ల దందా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement