చేపల వేటకు వెళ్లి | - | Sakshi
Sakshi News home page

చేపల వేటకు వెళ్లి

Sep 8 2025 7:40 AM | Updated on Sep 8 2025 7:40 AM

చేపల

చేపల వేటకు వెళ్లి

వలలు చుట్టుకొని మృతిచెందిన వైనం

ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందం గాలింపు చర్యలు

వరద తగ్గితే ఆచూకీ లభించే అవకాశం

ఆశిరెడ్డిపల్లిలో..

చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని ఆశిరెడ్డిపల్లిలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గత్ప లక్ష్మయ్య (40) రెడ్డిపిల్లి రెడ్డిచెరువులో చేపలు పట్టేందుకు వెళ్లాడు. ఉదయం 11గంటల ప్రాంతలో తన అన్న కృష్ణయ్యకు చెప్పి వల తీసుకొని చేపల వేటకు వెళ్లాడు. మధ్యాహ్న ఒంటి గంట అయినా.. తిరిగి రాకపోవడంతో కృష్ణయ్య చెరువు దగ్గరకు వెళ్లి చూడగా లక్ష్మయ్య వల చుట్టుకొని మృతిచెంది నీటిపై తెలియాడుతున్నాడు. దీంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందిచాడు. మృతుడికి భార్య, కూతురు, కూమారుడు ఉన్నారు.

ఇద్దరు మృతి, విద్యార్థి గల్లంతు

ద్దరు మైనర్లు శనివారం రాత్రి చేపల వేటకు పుట్టి సహాయంతో నదిలోకి వెళ్లి వలవేసి ఒడ్డుకు చేరుకున్నారు. రాత్రి కావడంతో ఇద్దరు ఒడ్డుకు చేర్చుకున్న పుట్టిలోనే నిద్రకు ఉపక్రమించారు. నదీ ప్రవాహం క్రమేపీ పెరగడంతో నీటి ప్రవాహంలో పుట్టి కొట్టుకుపోతన్నట్లు గుర్తించిన ఓ బాలుడు తేరుకుని బయటపడ్డాడు. మరో బాలుడు పుట్టితో సహా గల్లంతైన ఘటన గద్వాల మండలం రేకులపల్లిలో చోటు చేసుకుంది. బంధువులు, పోలీసుల కథనం మేరకు.. తెలుగు రాజేశ్‌, తెలుగు చంద్రశేఖర్‌(13) తొమ్మిదో తరగతి. గ్రామంలోని కృష్ణానది (లోయర్‌ జెన్‌కో) ప్రాంతంలో శనివారం రాత్రి చేపల వల వేసేందుకు వెళ్లారు. పుట్టిలో వెళ్లిన ఇద్దరు వలలు వేసిన తర్వాత నదీ ఒడ్డుకు వచ్చి అదే పుట్టిలో నిద్రపోయారు. ఒడ్డుకు చేరుకున్న క్రమంలో పుట్టిని తాడుతో కట్టివేయడం మరచిపోయారు. రాత్రి 10గంటల సమయంలో జూరాలకు కొంత మేర ఇన్‌ఫ్లో పెరగడంతో అధికారులు 8 నుంచి 11గేట్లు తెరిచ్చారు. వరద ప్రవాహం పెరగడంతో అలల తాకిడికి పుట్టి ముందుకు సాగుతూ లోయర్‌ జెన్‌కో స్పిల్‌వే నుంచి జారి పడింది. నిద్రలోంచి తెరుకున్న రాజేశ్‌ ఈత రావడంతో బయట్టపడ్డాడు. అయితే చంద్రశేఖర్‌ ప్రమాదవశాత్తు వరద ప్రవాహానికి కొట్టుకుపోయాడు. గల్లంతైన బాలుడుకి ఈత రాదనే విషయం తెలుసుకున్న వెంటనే బంధువులు, గ్రామస్తులు నదీ వద్దకు చేరుకున్నా ఫలితం లేకపోయింది. రూరల్‌ ఎస్‌ఐ శ్రీకాంత్‌ ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందంతో అక్కడికి చేరుకున్నారు. 1.20లక్షల క్యూసెకుల వరద ఉండడంతో వెలుపలికి వెళ్లినప్పటికీ సాధ్యం కాలేదు. గల్లంతైన విద్యార్థి కోసం అధికారులు శ్రమిస్తున్నారు. గల్లంతైన విద్యార్థి ఎప్పుడూ చేపల వేటకు వెళ్లలేదని ప్రస్తుతం ఎందుకు వెళ్లాడో తెలియదని బంధువులు చెబుతున్నారు. విద్యార్థి తండ్రి ఎనిమిదేళ్ల క్రితమే విద్యుత్‌ షాక్‌కు గురై మృతిచెందడంతో తల్లి పద్మ తన ముగ్గురు పిల్లలతో కలసి జీవిస్తున్నది. గల్లంతైన చిన్న కుమారుడు గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. సెలవులు ఉండడంతో ఇంటికి వచ్చి వరద ప్రవాహంలో కొట్టుకుపోయాడని తల్లి కంటతడి పెట్టింది. ఈ ఘటనపై రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని గాలింపు చర్యలు చేపట్టారు. వరద ప్రవాహం తగ్గుముఖం పడితే ఆచూకీ లభించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

వేర్వేరు ప్రాంతాల్లో చేపల వేటకు వెళ్లి ఇద్దరు మృతిచెందగా.. ఒక విద్యార్థి గల్లంతైన ఘటన

ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆదివారం చోటుచేసుకున్నది. చేపల కోసం విసిరే వల చుట్టుకొని ఇద్దరు మృతిచెందగా.. పుట్టి జూరాల వరద ప్రవాహంలో కొట్టుకుపోయి లోయర్‌ జెన్‌కో

ప్రాంతంలో గల్లంతైన బాలుడి కోసం ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందం గాలింపు చర్యలు చేపట్టగా..

ఫలితం లేకపోయింది. – గద్వాల క్రైం/గండేడ్‌/నాగర్‌కర్నూల్‌ క్రైం

విద్యార్థి గల్లంతైప లోయర్‌ జూరాల

చేపల వేటకు వెళ్లి 1
1/2

చేపల వేటకు వెళ్లి

చేపల వేటకు వెళ్లి 2
2/2

చేపల వేటకు వెళ్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement