
చాంపియన్లుగా శివాంశ్, శాన్వి
● ముగిసిన రాష్ట్రస్థాయి అండర్–13బ్యాడ్మింటన్ టోర్నీ
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లా కేంద్రంలోని మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న 11వ రాష్ట్రస్థాయి జూనియర్ (అండర్–13) బాల, బాలికల బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ ఉత్సాహంగా ముగిసింది. చివరి రోజు ఆదివారం బాల, బాలికల సింగిల్స్, డబుల్స్ విభాగాల ఫైనల్స్ మ్యాచ్‌లు హోరాహోరీగా సాగాయి.
● సింగిల్స్ చాంపియన్లు శివాంశ్, నిమ్మశాన్వి
బ్యాడ్మింటన్ టోర్నీ సింగిల్స్ విభాగంలో చాంపియన్లుగా పబ్బు శివాంశ్ (మేడ్చల్ మల్కాజ్‌గిరి), కంజుల జస్ప్రిత్ (వరంగల్) నిలిచారు. ఫైనల్ మ్యాచ్‌లో శివాంశ్ పబ్బు 15–8, 15–4 సెట్ల తేడాతో కంజుల జస్ప్రిత్‌పై విజయం సాధించాడు. అదేవిధంగా బాలికల ఫైనల్ నిమ్మశాన్వి (సంగారెడ్డి) 15–8, 15–7 సెట్ల తేడాతో అనుముల శ్రీవైభవి (నిజామాబాద్)పై గెలుపొందింది. సింగిల్స్ బాలుర మూడో స్థానంలో అద్వైత్ సత్తు (వికారాబాద్), నాలుగో స్థానంలో రాంచరణ్ తేజ ఆకుల (మేడ్చల్ మల్కాజ్‌గిరి), బాలికల విభాగంలో మూడో స్థానంలో దియా ఆనంద్ (వికారాబాద్), నాలుగో స్థానంలో మనస్విని భూక్య (వరంగల్) నిలిచారు.
హోరాహోరీగా డబుల్స్ మ్యాచ్‌లు
డబుల్స్ విభాగం ఫైనల్ మ్యాచ్‌లు హోరాహోరీగా సాగాయి. బాలుర మ్యాచ్‌లో కార్తీకేయ మహర్షి (రంగారెడ్డి)– శివాంశ్ పబ్బు (మేడ్చల్ మల్కాజ్‌గిరి) 15–11, 15–9 తేడాతో రాంచరణ్‌తేజ ఆకుల–శౌర్య ప్రతాప్‌సింగ్ (మేడ్చల్ మల్కాజ్‌గిరి)పై విజయం సాధించారు. మూడో స్థానంలో అద్వైత్ సత్తు (వికారాబాద్)–సుహిత్ యాదవ్ (రంగారెడ్డి), నాలుగో స్థానంలో అభిషిక్త్ (కరీంనగర్)–కంజుల జస్ప్రిత్ (వరంగల్) నిలిచారు. బాలికల డబుల్స్ విభాగం ఫైనల్ మ్యాచ్‌లో ఆభాజాదవ్ (రంగారెడ్డి)–దియా ఆనంద్ (వికారాబాద్) 15–4, 15–8 సెట్ల తేడాతో దీక్ష సహస్ర బండ (వికారాబాద్)–నిమ్మశాన్వి (సంగారెడ్డి)పై గెలుపొందారు. మూడో స్థానంలో తిరిణిచిత భూషణ్ (వికారాబాద్)– అన్విరెడ్డి (సంగారెడ్డి) నిలిచారు.
జాతీయస్థాయిలో ప్రతిభచాటాలి
రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీల్లో విజేతలుగా నిలిచినవారు రానున్న జాతీయ స్థాయి టోర్నీలో ప్రతిభచాటాలని ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ అన్నారు. ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని విన్నర్, రన్నరప్, మూడో స్థానం వారికి ట్రోఫీలు, మెడల్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ టోర్నీలో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారన్నారు. ఇదేస్ఫూర్తితో బ్యాడ్మింటన్‌లో పతకాలు సాధించి రాష్ట్రానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అమరేందర్‌రాజు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సురేందర్‌రెడ్డి, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ సంయుక్త కార్యదర్శి యూవీఎన్ బాబు, మహబూబ్‌నగర్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు శ్యాంసుందర్‌గౌడ్, రవికుమార్, నెట్‌బాల్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అధ్యక్షుడు విక్రం ఆదిత్యరెడ్డి, డాక్టర్ దీపక్, ప్రవీణ్‌కుమార్, నాగరాజుగౌడ్, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.