వంద రోజుల్లో | - | Sakshi
Sakshi News home page

వంద రోజుల్లో

Sep 8 2025 7:35 AM | Updated on Sep 8 2025 7:35 AM

వంద రోజుల్లో

వంద రోజుల్లో

586.515 మి.యూ. విద్యుదుత్పత్తి

సాగునీటి ప్రాజెక్టులకు

17.2 టీఎంసీలు

రికార్డుస్థాయిలో జూరాలకు పోటెత్తిన వరద

గద్వాల: ఎగువ ప్రాంతాలైన మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ఏకధాటిగా భారీ వర్షాలు కురుస్తుండడంతో జూరాలకు భారీగా వరద వచ్చి చేరుతుంది. దీంతో ఉమ్మడి జిల్లాకు పెద్దదిక్కుగా ఉన్న కృష్ణానదిపై నిర్మించిన తొలి ప్రాజెక్టు జూరాలకు జలకళ సంతరించుకుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు నీటిని ఎత్తిపోస్తూ దానికిందున్న ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేస్తున్నారు. ఈసారి జూరాలకు ముందస్తుగానే మే నెలలో 29వ తేదీన వరద మొదలవగా సెప్టెంబర్‌ 6వ తేదీ వరకు 918 టీఎంసీల వరద వచ్చింది.

● గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా వానాకాలంలో ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో కృష్ణాబేసిన్‌కు భారీగా వరదనీటితో నిండిపోయింది. కృష్ణాబేసిన్‌లో ఉన్న మహారాష్ట్రలోని ఉజ్జయిని, కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్‌ ప్రాజెక్టులకు భారీ వరదనీరు వచ్చి చేరుతుండడంతో నీటిని దిగువనున్న జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులకు విడుదల చేస్తున్నారు. మన రాష్ట్రంలో కృష్ణాబేసిన్‌లో తొలిప్రాజెక్టు ప్రియదర్శిని జూరాల పాజెక్టుకు మే 29వ తేదీన మొదటిసారిగా వరద మొదలైంది. అప్పటి నుంచి ఈ నెల 6వ తేదీ వరకు ప్రాజెక్టుకు గరిష్టంగా 4.18 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరగా, ప్రాజెక్టులోని 44 గేట్లు ఎత్తి దిగువనున్న శ్రీశైలానికి నీటిని విడుదల చేశారు. జూరాలకు వరద మొదలైనప్పటి నుంచి ప్రాజెక్టుకు మొత్తం 918 టీఎంసీల నీరు వచ్చింది. జూన్‌, జూలైలో మాసాల్లో వర్షాలు లేకపోవడంతో చాలా రోజులు జూరాలకు వరద పూర్తిగా తగ్గిపోయింది. తిరిగి జూలై చివరి వారంలో వరద ప్రారంభం కావడంతో ప్రాజెక్టు గేట్లు ఎత్తి, నీటిని విడుదల చేశారు.

వానాకాలం సీజన్‌లో జూరాల ప్రాజెక్టుకు 894 వరద వచ్చి చేరగా ప్రాజెక్టుకు ఇరువైపులా ఉన్న ఎగువ, దిగువ జలవిద్యుత్‌ ప్రాజెక్టులకు 218 టీఎంసీల నీటిని వినియోగించి 586.515 మిలియన్‌ యూనిట్ల విద్యుదుత్పత్తి చేపట్టారు. ఎగువ జలవిద్యుత్‌ కేంద్రంలో 6 యూనిట్ల ద్వారా విద్తుదుత్పత్తి కొనసాగుతుండగా సెప్టెంబర్‌ 4వ తేదీ వరకు 279.387 మి.యూనిట్ల విద్యుదుత్పత్తి చేశారు. ఇక దిగువ జలవిద్యుదుత్పత్తి కేంద్రంలో 6 యూనిట్ల ద్వారా 307.128 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసినట్లు తెలిపారు.

వానాకాలంలో జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చిచేరుతుండడంతో ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. జూరాల నుంచి 17.2 టీఎంసీలు సాగునీటి ప్రాజెక్టులకు వినియోగించుకుని మిగతా 675 టీఎంసీల నీటిని నదిలోకి వదిలేశారు. ఇందులో నెట్టెంపాడు ప్రాజెక్టుకు (4.3 టీఎంసీలు), భీమా–1 (2.6 టీఎంసీలు), భీమా–2, (2.9 టీఎంసీలు) కోయిల్‌సాగర్‌కు (1.9 టీఎంసీలు), కల్వకుర్తి ఎత్తిపోతలకు (4 టీఎంసీలు), జూరాల కుడి, ఎడమ, సమాంతర కాల్వలకు (1.50 టీఎంసీలు) ఎత్తిపోయగా.. మిగిలిన 659టీఎంసీలను నదిలోకి వదిలేశారు.

918 టీఎంసీలు

675 టీఎంసీలు నదిలోకి..

ఎత్తిపోతల పథకాల కోసం

17.2 టీఎంసీలు విడుదల

సెప్టెంబర్‌ మొదటి వారంలోనే

విద్యుదుత్పత్తి లక్ష్యం పూర్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement