
కిడ్నీలో రాళ్లు కరిగిపోయాయి..
కిడ్నీలో 4 మి.మీ పరిమాణం గల రాళ్లు ఉన్నాయని డాక్టర్లు చెప్పారు. ప్రైవేటు వైద్యం అయితే ఖర్చు ఎక్కువ అవుతుందని, తెలిసిన వారు చెప్పడంతో గండేడ్‌లోని ఆయుర్వేద వైద్యాధికారిని ఆశ్రయించా. మూడు నెలలకు మందులు ఇచ్చారు. అవి వాడగానే రాళ్లు కరిగిపోయాయి. దాని తర్వాత ఫ్యాటీ లివర్ వచ్చింది. దీనికి కూడా రెండు నెలలుగా మందులు వాడుతున్నాను. అది తగ్గు ముఖం పట్టింది. ఈ మందులు వల్ల ఎన్నో ఏళ్లుగా ఉన్న నడుం నొప్పి పూర్తిగా తగ్గింది. ఆయుర్వేద మందులపై పూర్తి నమ్మకం కలిగింది. – శ్రీకాంతాచారి, రంగారెడ్డిపల్లి