
తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలు
ఆయుర్వేద వైద్యం గ్రామీణ ప్రజలకు అనువైన వైద్యం. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయి. మూడు నుంచి ఆరు నెలలు వాడితే దీని వల్ల సత్ఫలితాలు ఉంటాయి. ఎలాంటి సైడ్ ఎఫెక్టులు లేకపోవడమే కాక రోగాన్ని కూకటి వేళ్లతో తొలగించడంలో ఆయుర్వేద వైద్యం దిట్ట. శరీరంలోని సమతూల్యతను పెంపొందిస్తూ రోగం పూర్తిగా నయం చేయడానికి ఆయుర్వేద మూలికలు ఉపకరిస్తున్నాయి. పెద్ద వయస్సు వాళ్లు ఎక్కువ ఈ మందుల వినియోగంపై ఆసక్తి చూపుతున్నారు. మిగతా గ్రామీణ ప్రజలు పూర్తిస్థాయిలో ఆయుర్వేద వైద్య సేవలను వినియోగించుకోవాలి. – శిల్ప, ఆయుర్వేద వైద్యురాలు, గండేడ్