
ప్రాదేశిక స్థానాల లెక్క తేలింది
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఖరారైన
జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలు..
జిల్లా జెడ్పీటీసీ ఎంపీపీ ఎంపీటీసీ
మహబూబ్‌నగర్ 16 16 175
నాగర్‌కర్నూల్ 20 20 214
వనపర్తి 15 15 113
జోగుళాంబ గద్వాల 13 13 142
నారాయణపేట 13 13 136
సాక్షి, నాగర్‌కర్నూల్: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా బుధవారం జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను ఖరారు చేసింది. సెప్టెంబర్ 30లోగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏ క్షణంలోనైనా స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడవచ్చన్న అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో పంచాయతీ ఎన్నికల కంటే ముందుగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ, జిల్లా పరిషత్ ఎన్నికలు ఉంటాయన్న ఊహగానాలు ఊపందుకున్నాయి.
రిజర్వేషన్లపై వీడని సందిగ్ధం..
స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల అంశం కీలకంగా మారింది. రానున్న ఎన్నికల్లో రిజర్వేషన్లపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఇప్పటికే పంచాయతీ సర్పంచుల పదవీకాలం పూర్తయ్యి ఏడాదిన్నర కాలం గడిచింది. సుదీర్ఘకాలంగా ప్రత్యేక పాలన కొనసాగుతుండటంతో తిరిగి ఎన్నికలు ఎప్పుడు చేపడుతారోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం బీసీ వర్గాలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెబుతోంది. ఈ క్రమంలోనే ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్లు కల్పించేందుకు సన్నాహాలు చేపడుతోంది. ఈ ప్రక్రియ వేగవంతమైన ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగితేనే బీసీలకు రిజర్వేషన్ పెంపు అమలయ్యే అవకాశం ఉంది. సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలన్న కోర్టు ఆదేశం నేపథ్యంలో రిజర్వేషన్ల అమలుపై సందిగ్ధం నెలకొంది. కొత్తగా బీసీలకు రిజర్వేషన్‌ను పెంచి ఎన్నికలు నిర్వహిస్తారా, లేక పాత రిజర్వేషన్లకే పరిమతమవుతారా? అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.
జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను
ప్రకటించిన ప్రభుత్వం
ఉమ్మడి జిల్లాలో 780 ఎంపీటీసీ స్థానాలు
పంచాయతీ కన్నా ముందే
జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై ఊహాగానాలు