
ఏదీ సమయపాలన?
వైద్యో నారాయణ..
పీహెచ్‌సీల్లో సిబ్బంది ఇష్టారాజ్యంగా విధులకు హాజరు
గండేడ్ పీహెచ్‌సీలో ఉదయం 10.08 గంటల వరకు ఖాళీగా వైద్యుడి చాంబర్
మిడ్జిల్ ఆస్పత్రిలో 10 గంటలకు ఖాళీగా ఉన్న వైద్యుల కుర్చీలు
2024 ఏప్రిల్ నుంచి 2025 మార్చి వరకు
జిల్లాలోని పీహెచ్‌సీల్లో అయిన ప్రసవాలు
నవాబుపేట243
జానంపేట 159
దేవరకద్ర
317
గండేడ్ 150
హన్వాడ 135
బాలానగర్84
చిన్నచింతకుంట
90
అడ్డాకుల
46
భూత్పూర్
38
మహమ్మదాబాద్
66
మణికొండ
35
ఎదిర 23
పేరూర్
30
కొత్లాబాద్
18
పాలమూరు: గ్రామాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యం నాణ్యంగా అందుబాటులో ఉంటే.. పల్లెల నుంచి ప్రజలు పట్టణాలకు రావాల్సిన పరిస్థితి ఉండదు. కానీ జిల్లాలో క్షేత్రస్థాయిలో సరైన వైద్యసేవలు అందుబాటులో లేకపోవడం వల్ల దగ్గు, జలుబు, జ్వరం, నొప్పులతో బాధపడేవారు సైతం జనరల్ ఆస్పత్రి, ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్తున్నారు. విధుల్లో ఉండాల్సిన మెడికల్ ఆఫీసర్లు, ఇతర సిబ్బంది మధ్యాహ్నం తర్వాత అందుబాటులో ఉండకపోవడం వల్ల సాధారణ ప్రసవాలు కావడం లేదు. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల మధ్యలో ఓపీ చూసి ఆ తర్వాత సొంత క్లీనిక్‌లపై దృష్టి పెడుతున్నారు. బుధవారం జిల్లాలో పలు పీహెచ్‌సీలు, అర్బన్‌హెల్త్ సెంటర్లలో ‘సాక్షి’ బృందం విజిట్ చేయగా పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.
● జిల్లాలో 17 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఒక కమ్యూనిటీ హెల్త్ సెంటర్, నాలుగు అర్బన్ హెల్త్ సెంటర్లు, 129 సబ్‌సెంటర్లు ఉన్నాయి. ప్రతి పీహెచ్‌సీకి ఒక మెడికల్ ఆఫీసర్, ఫార్మాసిస్ట్, సాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్, ఏఎన్‌ఎంలు, డీఈఓ సిబ్బందితో పని చేయాల్సి ఉంటుంది. 13 పీహెచ్‌సీలు 24 గంటలూ, నాలుగు పీహెచ్‌సీలు 12 గంటల పాటు వైద్యసేవలు అందుబాటులో ఉండాలి. ఉదయం 9 గంటల నుంచి వైద్యులతో పాటు ఇతర సిబ్బంది సమయానికి పీహెచ్‌సీలో ఉంటూ రోగులకు వైద్యసేవలు అందించాలి. కానీ జిల్లాలో ఉన్న పీహెచ్‌సీలలో మెడికల్ ఆఫీసర్‌లతో పాటు ఇతర సిబ్బంది సమయపాలన పాటించడం లేదు. ఒకరు 10 గంటలకు వస్తే..మరొకరు మధ్యాహ్నం వస్తారు..కొందరైతే క్షేత్రస్థాయిలో పరిశీలన(వ్యాక్సినేషన్ విజిట్)లో ఉన్నామని చెబుతున్నారు. ప్రధానంగా 24 గంటల పాటు పని చేయాల్సిన పీహెచ్‌సీలలో మధ్యాహ్నం తర్వాత మెడికల్ ఆఫీసర్లు, ఇతర సిబ్బంది కన్పించడం లేదు. వాచ్‌మెన్ లేదా స్వీపర్లతో మిగిలిన సమయం నడుపుతున్నారు.
మిడ్జిల్ 18
రాజాపూర్ 15
గంగాపూర్ 15
మధ్యాహ్నం తర్వాత అందుబాటులో
ఉండని వైద్యులు
దేవరకద్రలో అవస్థలు పడుతూ
ప్రసవం కోసం వచ్చిన గర్భిణులు
సాధారణ ప్రసవాలపై పూర్తిగా నిర్లక్ష్యం
సకాలంలో అందుబాటులో ఉండాలి
పీహెచ్‌సీలలో మెడికల్ ఆఫీసర్ల సమయపాలన కోసం బయోమెట్రిక్, ఫేస్ గుర్తింపు వంటి పరికరాలు ఏర్పాటు చేయడానికి కసరత్తు జరుగుతుంది. ఓపీ సమయంతో పాటు ఇతర సందర్భాల్లో విధుల్లో ఉండాల్సిన వారు లేకపోతే విచారణ చేసి తప్పక చర్యలు తీసుకుంటాం. ప్రతి ఒక్క సిబ్బంది సకాలంలో అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపడతాం. పీహెచ్‌సీలలో చాలా వరకు సాధారణ ప్రసవాలు పెరిగాయి.
– డాక్టర్ పద్మజా, ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓ
టెస్టు కోసం వచ్చాను...
అప్పుడప్పుడు షుగర్ టెస్టు చేసుకోవడానికి వస్తాను. ఈ రోజు ల్యాబ్ టెక్నీషియన్ రాకపోవడంతో టెస్టు చేయించుకోకుండానే వెళ్లిపోతున్నా. ఆస్పత్రి జాతీయ రహదారికి అవతలి వైపు ఉంది. రోడ్డు నిత్యం రద్దీగా ఉండడంతో రోడ్డు దాటి రావాలంటే ఇబ్బంది పడాల్సి వస్తోంది. – రామచంద్రమ్మ, గండేడ్
2025 ఏప్రిల్ నుంచి జూన్ 30 వరకు 17 పీహెచ్‌సీలలో 303 సాధారణ ప్రసవాలయ్యాయి. దీంట్లో మిడ్జిల్‌లో ఒకటి, గంగాపూర్‌లో రెండు, పేరూర్‌లో ఐదు, కొత్లాబాద్‌లో ఆరు, మణికొండలో 8, ఎదిరలో 9, మహమ్మదాబాద్‌లో 9, సీసీకుంటలో 10, భూత్పూర్ 11, బాలానగర్ 15, అడ్డాకుల 16, హన్వాడ 21, రాజాపూర్25, గండేడ్ 29, జానంపేట 35, నవాబుపేటలో 36, దేవరకద్రలో 65 ప్రసవాలయ్యాయి. మూడు నెలల కాలంలో ఏడు పీహెచ్‌సీలలో పది లోపే ప్రసవాలు జరిగాయి. అన్ని పీహెచ్‌సీలలో మెడికల్ ఆఫీసర్లు మధ్యాహ్నం తర్వాత విధుల్లో లేకపోవడం వల్ల ప్రసవం కోసం వచ్చిన గర్భిణీలు ఇతర ఆస్పత్రులకు వెళ్లిపోతున్నారు.
జిల్లాలో 17 పీహెచ్‌సీలలో రెండేళ్లుగా విద్యుత్ బకాయిలు చెల్లించడం లేదు. పాత పాలమూరు కరెంట్ బిల్లు బకాయిలు రూ.1,02,473 ఉండగా రామయ్యబౌళికి సంబంధించి రూ.66,610 ఉంది. గంగాపూర్ పీహెచ్‌సీకి సంబంధించి రూ.1.35 లోల బిల్లు పెండింగ్‌లో ఉంఇ. ఇలా ప్రతి పీహెచ్‌సీకి సంబంధించిన బిల్లు దాదాపు రూ.లక్ష మేర బకాయిలు ఉండడం విశేషం.

ఏదీ సమయపాలన?

ఏదీ సమయపాలన?