
కార్మికుల తరఫున పోరాడేది ‘1104’ మాత్రమే
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): విద్యుత్ కార్మికుల తరఫున పోరాడేది కేవలం 1104 మాత్రమేనని విద్యుత్ ఉద్యోగుల 1104 యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబా అన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నాలుగోసారి ఏకగ్రీవంగా ఎన్నికై న సందర్భంగా బుధవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. విద్యత్ సంస్థను ప్రైవేట్ పరం చేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్ పరిస్థతి ఎవరికీ రాకూడదంటే కార్మికులు ఐకమత్యంతో ఉండాలని కోరారు. కులాల ప్రాతిపదికన విడిపోయినట్‌లైతే ముందు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటామన్నారు. ఎల్లవేళలా రాష్ట్రంలో కార్మికుల కోసం అహర్నశలు పరితపించే నాయకత్వం కేవలం మన 1104 యూనియన్ నాయకులకే సాధ్యమన్నారు. ఆర్జిన్ కార్మికులకు క్యాజువల్ లీవ్స్‌తోపాటు విద్యార్థులను బట్టి కన్వర్షన్ ఇవ్వాలన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో యాజమాన్యానికి యూనియన్ తరఫున లెటర్ ఇచ్చామన్నారు. ఈపీఎఫ్ టూ జీపీఎఫ్ కోసం ప్రతి సందర్భంలో యాజమాన్యం దృష్టికి సమస్యను తీసుకుపోతున్నట్లు తెలిపారు. అనంతరం ఆయనను గజమాలతో సన్మానించడంతోపాటు జ్ఞాపికను బహూకరించారు. కార్యక్రమంలో 1104 యూనియన్ సర్కిల్ అధ్యక్షుడు స్వామి, కార్యదర్శి పాండునాయక్, విజయ్‌ముదిరాజ్ సర్కిల్, డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు, ఈఆర్‌ఓ, ఓఅండ్‌ఎం సిబ్బంది పాల్గొన్నారు.
విద్యుత్ ఉద్యోగుల 1104 రాష్ట్ర ప్రధాన
కార్యదర్శి సాయిబాబా