ఆయుధాలను గౌరవించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ఆయుధాలను గౌరవించుకోవాలి

Oct 11 2024 1:10 AM | Updated on Oct 11 2024 1:10 AM

ఆయుధాలను గౌరవించుకోవాలి

ఆయుధాలను గౌరవించుకోవాలి

మహబూబ్‌నగర్‌ క్రైం: పోలీస్‌ వ్యవస్థలో ప్రతి సభ్యుడు ఆయుధాన్ని గౌరవిస్తూ, బాధ్యతాయుతంగా తమ విధులు నిర్వహించాల్సిన అవసరం ఉందని డీఐజీ ఎల్‌ఎస్‌ చౌహాన్‌ అన్నారు. దసరా పండగ నేపథ్యంలో దుర్గాష్టమి సందర్భంగా జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో గురువారం ఆయుధ, వాహన పూజతోపాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమానికి డీఐజీ, జిల్లా ఎస్పీ డి.జానకి హాజరై ఆయుధాలకు, వాహనాలకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ పోలీస్‌ వ్యవస్థలో ప్రతి ఏడాది ఆయుధాలు, వాహనాలకు సంప్రదాయమైన పద్ధతిలో పూజించుకోవాలన్నారు. సమాజంలో శాంతిభద్రతలతోపాటు ప్రజలకు రక్షణ కల్పించడంలో పోలీస్‌ పాత్ర ఎంతో కీలకమైందన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీలు రాములు, సురేష్‌కుమార్‌, డీఎస్పీలు వెంకటేశ్వర్లు, రమణారెడ్డి, శ్రీనివాసులు, సీఐలు అప్పయ్య, గాంధీనాయక్‌, ఆర్‌ఐలు కృష్ణయ్య, నగేష్‌, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement