తాను చనిపోతూ.. మరికొందరికి జీవితాన్నిచ్చింది ఓ ఇల్లాలు... | - | Sakshi
Sakshi News home page

తాను చనిపోతూ.. మరికొందరికి జీవితాన్నిచ్చింది ఓ ఇల్లాలు...

Mar 28 2023 1:04 AM | Updated on Mar 28 2023 11:53 AM

- - Sakshi

నారాయణపేట: తాను చనిపోతూ.. మరికొందరికి జీవితాన్నిచ్చింది ఓ ఇల్లాలు. వివరాలిలా.. నారాయణపేట జిల్లా కృష్ణ మండలకేంద్రానికి చెందిన శేషగిరి ఆచార్‌ భార్య వీణ కలిసి నాలుగు రోజుల క్రితం ద్విచక్రవాహనంపై ఇంటి నుంచి బయలుదేరారు. ఈ క్రమంలో ఓ బాలుడు టీవీఎస్‌ను అజాగ్రత్తగా నడుపుతూ రావడంతో శేషగిరి తన బైక్‌ను సడన్‌బ్రేక్‌ వేశారు. దీంతో వెనక ఉన్న భార్య వీణ తారు రోడ్డుపై పడటంతో తలకు తీవ్రగాయాలయ్యాయి.

వెంటనే రాయిచూర్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆస్పత్రి తరలించగా ఆదివారం రాత్రి మృతిచెందింది. దీంతో కిమ్స్‌ ఆస్పత్రి వైద్యులు వీణ భర్తను అవయవాలు దానం చేయాలని కోరగా.. ఆయన అంగీకరించడంతో కిడ్నీలు, గుండె, కళ్లు, గుండె లంగ్స్‌ సేకరించారు. ఈ మేరకు శేషగిరిని అభినందిస్తూ ఆస్పత్రి ప్రశంసపత్రాన్ని అందజేశారు. సోమవారం వీణకు స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement