● 1,969 క్వింటాళ్ల విక్రయం
● రేపటి నుంచి పత్తి కొనుగోళ్లు
మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్‌కు సోమవారం మక్కలు పోటెత్తాయి. 1,969 క్వింటాళ్ల (3,282 బస్తాలు) మక్కల విక్రయం జరిగింది. క్వింటాకు గరిష్ట ధర రూ.2,646 కనిష్ట ధర రూ.2435, మోడల్ ధర రూ.2636 పలికిందని మార్కెట్ చైర్మన్ ఇస్లావత్ సుధాకర్, సెక్రటరీ వేముల వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర రూ.2,410 కాగా, అంతకు మించి ధర పలకడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు.
రేపటి నుంచి పత్తి కొనుగోళ్లు..
మహబూబాబాద్ మార్కెట్‌లో ఈ నెల 14వ తేదీ నుంచి వ్యాపారులు కొత్త పత్తి కొనుగోళ్లు ప్రారంభిస్తారని చైర్మన్ ఇస్లావత్ సుధాకర్, సెక్రటరీ వేముల వెంకటేశ్వర్లు తెలిపారు. రైతులు పత్తిని బస్తాల్లో తీసుకురావాలని సూచించారు. రైతులు నాణ్యమైన పత్తిని తీసుకువచ్చి మంచి ధర పొందాలని వారు కోరారు.


