కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం పత్తి క్వింటాకు రికార్డుస్థాయిలో ధర రూ.9,111లు పలికింది. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు.
● కలెక్టర్ స్నేహశబరీష్ ● ప్రజావాణిలో 119 అర్జీలు
వాతావరణం
జిల్లాలో ఉదయం వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మధ్యాహ్నం ఎండతో పాటు ఉక్కపోతగా ఉంటుంది.
వినతులు వెంటనే పరిష్కరించాలి
మహబూబాబాద్: ప్రజావాణి వినతుల విషయంలో నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ స్నేహశబరీష్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని ప్రధాన సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ స్వయంగా వినతులు స్వీకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. పెండింగ్ వినతులను కూడా త్వరగా పరిష్కరించాలన్నారు. పరిష్కారం సాధ్యం కానివి వివరాలతో కూడిన నివేదిక ఇవ్వాలన్నారు. సత్వర పరిష్కారం కోసమే ప్రజావాణి అనే విషయాన్ని అధికారులు గుర్తు పెట్టుకోవాలన్నారు. వినతుల విషయంలో నిర్లక్ష్యం చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ప్రజావాణిలో 119 వినతులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. అదనపు కలెక్టర్ అనిల్‌కుమార్, ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్ పురుషోత్తం, డీఆర్వో నాగలక్ష్మి పాల్గొన్నారు.
గుమ్చీలు తొలగించడం సరికాదు..
అభివృద్ధి పేరుతో గాంధీపార్క్ ప్రహరీ వెంట ఉన్న గుమ్చీలు తొలగించాలని అధికారులు చెప్పడం భావ్యంకాదని, అవి అభివృద్ధికి అడ్డుగా లేవని మట్టూరి నాగేశ్వర్‌రావు, అన్సారీ వినతి అందజేశారు.
ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి
మొదటి విడతలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాగా, పలు కారణాలతో పేరును తొలగించారు. పట్టా భూమి అయినా ప్రభుత్వ భూమి అని తొలగించారు. అయితే అధికారులు సర్వే చేసి పట్టా భూమి అని తేల్చారు. కానీ, నేటికీ ఇల్లు మంజూరు కాలేదు. కలెక్టరేట్‌లో రెండు సార్లు వినతి ఇచ్చినా ఫలితం లేదు.
–ఎస్.శ్రీకాంత్, నాగలక్ష్మి దంపతులు, బాలాజీతండా, గార్ల
సర్ పేరుతో ఓట్ల తొలగింపు సరికాదు
సర్ పేరుతో ఓట్ల తొలగింపు సరికాదు. దేశంలో 13 కోట్ల మంది ఓట్లు తొలగించారు. సర్ ప్రక్రియను నిలిపివేసి, తొలగించిన ఓట్లు చేర్చాలి. ఓటు అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు, సర్‌ను నిలిపివేయకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తాం.
–పద్మ, రమ, బిన్నమ్మ, పీఓడబ్ల్యూ నాయకురాళ్లు


