● ఎస్పీ శబరీష్
మహబూబాబాద్ రూరల్: పోలీసు సేవలు, అమరవీరుల త్యాగాలు, ప్రజల భద్రత కోసం పోలీసులు చేస్తున్న కృషిని ప్రజలకు చేరువ చేసే లక్ష్యంతో పోలీస్ ఫ్లాగ్ డే వారోత్సవాల్లో భాగంగా మూడు నిమిషాల నిడివి గల షార్ట్ ఫిల్మ్, ఫొటోగ్రఫీ పోటీలు నిర్వహిస్తున్నామని ఎస్పీ శబరీష్ సోమవారం తెలిపారు. ప్రస్తుత పోలీసుల సేవలు, అమరవీరుల త్యాగాలను ప్రతిబింబించేలా సృజనాత్మక చిత్రాలు రూపొందించాలన్నారు. ఈ పోటీల్లో ఫొటోగ్రాఫ ర్లు, వీడియోగ్రాఫర్లు, ఇతర సృజనాత్మక ప్రతిభ కలి గిన వారు పాల్గొనవచ్చన్నారు. పోలీసుల విధులు, ప్రజలకు అందిస్తున్న సేవలు, పోలీసు, ప్రజల స్నే హపూర్వక సంబంధాలు, అమరవీరుల త్యాగాలు, మహిళలు, పిల్లల భద్రత, ట్రాఫిక్, రోడ్డు భద్రత, నేర నియంత్రణ, సామాజిక అవగాహన కార్యక్రమాలు తదితర అంశాలపై షార్ట్ ఫిల్మ్‌లు, ఫొటోలు రూపొందించాలని సూచించారు. షార్ట్ ఫిల్మ్ నిడివి గరిష్టంగా 3 నిమిషాలు ఉండాలని, ఫొటోగ్రఫీ పోటీలకు ఇటీవల తీసిన, పోలీసు శాఖ సేవలను ప్రతిబింబించే ఉత్తమ ఛాయాచిత్రాలు సమర్పించాలని తెలిపారు. పోటీల్లో పాల్గొనే వారు తమ ఎంట్రీలను ఈ నెల 23వ తేదీలోగా ఎస్పీ కార్యాలయ పీఆర్‌ఓ కుశల్ కుమార్ 77025 13469 నంబర్ ద్వారా సంప్రదించి అందజేయాలని సూచించారు. జిల్లా స్థాయిలో న్యాయనిర్ణేతల ద్వారా ఉత్తమ మూడు షార్ట్ ఫిల్మ్‌లు, మూడు ఉత్తమ ఛాయాచిత్రాలను ఎంపిక చేసి, విజేతలకు బహుమతులు, ప్రశంసపత్రాలు అందజేస్తామన్నా రు. జిల్లా స్థాయిలో ఎంపికై న టాప్ 3 షార్ట్ ఫిల్మ్ లు, ఛాయాచిత్రాలను రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తామని, రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచిన విజేతలకు డీజీపీ చేతుల మీదుగా బహుమతులు, ప్రశంసపత్రాలు అందజేస్తారన్నారు.


