● వీసీలో ఉపముఖ్యమంత్రి
మల్లు భట్టి విక్రమార్క
మహబూబాబాద్ రూరల్: సూపర్ ఎల్‌నినో ప్రభావంతో పలు ప్రాంతాల్లో తాగు, సాగునీరు, విద్యుత్ సమస్యలు తలెత్తే పరిస్థితులు ఉన్నాయని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నా రు. సోమవారం హైదరాబాద్ నుంచి ఉప ముఖ్య మంత్రి మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ, రవాణాశాఖల మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ఇతర ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతు నేస్తం కార్యక్రమంలో రైతులతో మాట్లాడి, యాసంగి పంటల సాగు ప్రణాళి కపై దిశానిర్దేశం చేశారు. జిల్లా కేంద్రంలోని రైతు వేదికలో హాజరైన కలెక్టర్ స్నేహశబరీష్ వీడియో కాన్ఫరెన్స్ అనంతరం రైతులతో మాట్లాడారు. రాష్ట్రంలో నెలకొన్న ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో రాబోయే రోజుల్లో వర్షపాతం తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నందువల్ల రైతులు ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పంటల సాగు ప్రణాళికను రూపొందించుకోవాలని సూచించారు. ఈ యాసంగి సీజన్‌లో వరి సాగుకు బదులు ప్రత్యామ్నాయ పంటలైన పప్పుధాన్యాలు మినుములు, పెసర, శనగలు, కందులు, అలాగే నూనె గింజల పంటలైన వేరుశనగ, పొద్దు తిరుగు డు, కుసుమ, నువ్వులు, తదితర పంటలను సాగు చేసేందుకు రైతులు ముందుకు రావాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ గుగులోత్ జ్యోతి, స్థానిక సంస్థల ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్ పురుషోత్తం, డీఏఓ విజయచంద్ర, ఏడీఏ శ్రీనివాసరావు, ఏఓ తిరుపతిరెడ్డి, డీహెచ్‌ఎస్‌ఓ జినుగు మరియన్న, డీఎంఓ నరేందర్, పశుసంవర్థకశాఖ అధికారి కిరణ్ కుమార్, తహసీల్దార్ రాజేశ్వర్ రావు, ఇతర సంబంధిత అధికారులు, సర్పంచ్‌లు, రైతులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


