వీధిలైట్లు అమర్చుతూ కానరాని లోకాలకు.. | - | Sakshi
Sakshi News home page

వీధిలైట్లు అమర్చుతూ కానరాని లోకాలకు..

Oct 12 2026 8:40 AM | Updated on Oct 12 2026 8:40 AM

● విద్యుదాఘాతంతో యువకుడి మృతి

మల్హర్‌(కాటారం) : దసరా పండుగ ఏర్పాట్లలో విషాదం చోటుచేసుకుంది. వీధిలైట్లు అమర్చుతూ విద్యుత్‌ షాక్‌కు గురై ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం చిదినేపల్లిలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామంలో దసరా ఉత్సవాలకు వీధిలైట్లు ఏర్పాటు చేస్తుండగా బౌతు కరుణాకర్‌ (20) ప్రమాదవశాత్తు షాక్‌ తగిలి కుప్పకూలిపోయాడు. స్థానికులు 108కు సమాచారం ఇవ్వగా మహదేవపూర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి తల్లిదండ్రులు సూరమ్మ, సమ్మయ్య ఉన్నారు. కరుణాకర్‌ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

మాజీ నక్సలైట్‌ ఆత్మహత్య

మహాముత్తారం: జయశంకర్‌భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం బోర్లగూడెం గ్రామానికి చెందిన మాజీ నక్సలైట్‌, సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు సుదాటి సుగుణాకర్‌రావు(45) ఆదివారం తన నివాసంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. గతంలో పాణిబాక్షి దళంలో మహదేవపూర్‌, ఏటూరునాగారం డిప్యూటీ కమాండర్‌గా బాధ్యతలు నిర్వర్తించి అనంతరం లొంగిపోయారు. ఆయన భార్య రజిత గతంలో బోర్లగూడెం సర్పంచ్‌గా సేవలు అందించారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీలో క్రీయాశీలకంగా కొనసాగుతున్న సుగుణాకర్‌రావు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement