హన్మకొండ: భద్రకాళి ఆలయంలో విద్యుత్ కోతలంటూ సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం అవాస్తవమని, అభివృద్ధి పనుల కోసం తాత్కాలికంగా విద్యుత్ సరఫరా నిలిపివేశామని టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ టౌన్ డీఈ జి.సాంబ రెడ్డి తెలిపారు. ఆలయానికి ఎలాంటి సాధారణ విద్యుత్ కోతలు విధించలేదని ఆయన స్పష్టం చేశారు. హనుమకొండ కలెక్టర్ ఆదేశాల మేరకు భద్రకాళి దేవాలయ మాడవీధుల్లో రథోత్సవం సందర్భంగా రథం సాఫీగా తిరిగేందుకు వీలుగా ఆదివారం విద్యుత్ లైన్ల ఎత్తును పెంచే పనులు చేపట్టినట్లు తెలిపారు. ఈ పనులను కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కుడా), దేవాదాయ శాఖ, విద్యుత్ శాఖ అధికారులు సమన్వయంతో పర్యవేక్షించారని వివరించారు. దేవాలయానికి విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని, నిరంతర విద్యుత్ అందిస్తున్నామని స్పష్టం చేశారు.
బ్యాటరీ దొంగల బీభత్సం!
ఖిలా వరంగల్: మిల్స్‌కాలనీ పోలీస్ స్టేషన్‌పరిధిలో బ్యాటరీ దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. రహదారులపై పార్కింగ్ చేసిన లారీల నుంచి బ్యాటరీలను చోరీ చేస్తున్నారని యజమానులు వాపోతున్నారు. ఈ ఏడాది సుమారు 40 వరకు బ్యాటరీలు ఎత్తుకెళ్లారని వారు పేర్కొంటున్నారు. లారీల బ్యాటరీలు చోరీకి గురికాకుండా పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టాలని కోరుతూ వారు ఆదివారం డీజీపీ, సీపీకి వేర్వేరుగా ఎక్స్(ట్విటర్) ద్వారా ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.
హైవేపై బైక్ స్టంట్లు..
● భయాందోళనలో ప్రయాణికులు
● విద్యార్థులపై కేసు నమోదు
హసన్‌పర్తి : జాతీయ రహదారిపై విద్యార్థులు బైక్ పై ప్రమాదకర స్టంట్లు చేశారు. దీనిని చూసిన ప్ర యాణికులు భయాందోళనకు గురయ్యారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో హసన్‌పర్తి పోలీసులు విద్యార్థులపై కేసులు నమో దు చేశారు. శనివారం నగర సమీపంలోని ఓ ప్రైవే ట్ కళాశాలకు చెందిన విద్యార్థులు కరీంనగర్–వరంగల్ జాతీయ ప్రధాన రహదారిపై ఎల్లాపురం ఓఆర్‌ఆర్ మీదుగా బైక్‌స్టంట్లు, కారు రేసింగ్‌తో విన్యాసం చేశారు. దీనిని చూసి ఆ మార్గం నుంచి వె ళ్లే వారు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘట నపై సదరు విద్యార్థులపై కేసు నమోదు చేసినట్లు హసన్‌పర్తి పోలీస్‌ఇన్‌స్పెక్టర్ మహేందర్ ఆదివారం తెలిపారు. ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు కలిగించేలా రోడ్లపై స్టంట్ల, రేసింగ్‌లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కాజీపేట రైల్వే స్టేషన్‌లో
గుర్తుతెలియని వ్యక్తి మృతి
కాజీపేట రూరల్ : కాజీపేట రైల్వే స్టేషన్‌లో ఆదివారం గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. కాజీపేట జీఆర్‌పీ ఎస్సై అభినవ్ కథనం ప్రకారం.. రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫాం–1పై సుమారు 45 ఏళ్ల వయస్సు గల గుర్తుతెలియని వ్యక్తి మృతి చెంది ఉన్నాడు. రైల్వే సిబ్బంది సమాచారం మేరకు జీఆర్‌పీ హెడ్‌కానిస్టేబుల్ ఆంజనేయులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు దాదాపు 5.5 ఫీట్ల ఎత్తు, చామన్ చాయరంగు, బూడిదరంగు ఫుల్ గళ్ల చొక్కా, బ్రౌన్‌కలర్ వైట్‌ప్యాంట్ ధరించి ఉన్నాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి మార్చురీకి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడి వివరాలు తెలిసిన వారు కాజీపేట జీఆర్ పోలీస్ స్టేషన్‌లో లేదా 8712658609, 8712538630 నంబర్లలో సంప్రదించాలన్నారు.


