వారసత్వ గుర్తింపు ఇంకెప్పుడు? | - | Sakshi
Sakshi News home page

వారసత్వ గుర్తింపు ఇంకెప్పుడు?

Oct 12 2026 8:40 AM | Updated on Oct 12 2026 8:40 AM

ఖిలా వరంగల్‌: ఓరుగల్లు కోట అంటే శిల్ప కళా వైభవానికి నిలుపుటద్దం.. కాకతీయుల కళా నైపుణ్యానికి చెరగని సంతకం.. రాతిలో సైతం రమణీయతను ఒలికించిన అద్భుత నిర్మాణశైలి.. నాటి కా కతీయుల కళాభిరుచికి ప్రతీకగా నిలిచిన ఈచారిత్ర క సంపద చూపరులను అబ్బురపరుస్తోంది. శిలల పై చెక్కిన సున్నితమైన ఆకృతులు, అపురూపమైన అలంకరణలు నాటి శిల్పుల ప్రతిభకు పట్టం కడుతున్నాయి. ఇంతటి సంపదకు ప్రపంచ స్థాయి గుర్తి ంపు దక్కాల్సి ఉన్నా.. యునెస్కో వారసత్వ హోదా దిశగా ప్రతిపాదనల పురోగతిపై నెలకొన్న స్తబ్ధత చర్చనీయాంశంగా మారుతోంది. తరాలకు అందాల్సిన ఈశిల్ప కళావైభవానికి అంతర్జాతీయ గుర్తింపు ఎప్పుడనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

రాష్ట్ర

రాజముద్రలో చోటు..

కళాతోరణానికి రాష్ట్రంలో ప్రత్యేక స్థానం ఉంది. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర రాజముద్రలో చోట దక్కించుకుంది. ఈ తోరణాలు ప్రపంచ పర్యాటకులను సైతం ఆకర్షిస్తున్నాయి. శిల్పకళా సంపద, శంభులింగేశ్వరస్వామి ఆలయ వైభోగానికి ప్రపంచ వారసత్వ సంపద గుర్తింపు ప్రతిపాదనలతో దశాబ్దాలుగా పర్యాటకులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే పురాతత్వ శాఖ ద్వారా కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆలయంపై సమగ్ర నివేదిక రూపొందించింది. ఈమేరకు ఐక్యరాజ్య సమితిలో భాగమైన యునెస్కో గుర్తింపు కోసం నివేదిక పంపారు. అయితే, నివేదిక ఇచ్చి ఏళ్లు దాటినా నేటికీ కార్యరూపం దాల్చలేదు. దీంతో ప్రపంచ వారసత్వ గుర్తింపు ఇంకెన్నాళ్లు అన్న ఆందోళన పర్యాటకుల్లో నెలకొంది.

వన్నె తగ్గని కళారాజ్యం..

రాజులు, రాజ్యాలు మారినా నాటి శిల్పకళా వైభవానికి ప్రతీకగా శిథిలమైన స్వయంభూ శ్రీశంభులింగేశ్వరస్వామి ఆలయం నిలిచింది. నాలుగు కాకతీయ తోరణాలు నేటికి పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ఆధ్యాత్మిక, చారిత్రక కళలకు పెట్టింది పేరు. 12వ శతాబ్దంలో ఈఆలయం, కాకతీయ తోరణాన్ని గణపతిదేవ చక్రవర్తి నిర్మించారు. ఈ కళాతోరణం మధ్యకోటలోని స్వయంభూ శంభులింగేశ్వరస్వామి ఆలయానికి ప్రవేశ ద్వారంగా ఉండేది. కాకతీయ రాజులు తమ శక్తి సామర్థ్యాలను ప్రదర్శించడానికి ఆ అద్భుతాన్ని నిర్మించారు. కోటకు నాలుగు దిక్కులా ఉన్న ప్రధాన ద్వారాలను తోరణాలుగా నిర్మించారు.

ధర్మపాలనకు నిదర్శనం..

కాకతీయుల పాలనలో ధర్మం నాలుగు పాదాలపై నడిచిందని చరిత్రకారులు చెబుతున్నారు. ఈ అద్భుతమైన ఆలయానికి నాలుగు వైపులా మంత్రముగ్ధులయ్యే శిల్ప కళా సంపదతో కూడిన కీర్తి తోరణాలను నిర్మించారు. ఈతోరణాలు కేవలం అలంకారం కోసం చేసిన డిజైన్‌ కాదు.. వాటి మీద కాకతీయుల పాలనా వైభవమంతా పూసగుచ్చినట్లు ఉంటుంది. వాళ్ల ఏలుబడిలో ఏయే అంశాలకు ప్రాధాన్యమిచ్చారో ఈతోరణాలు తెలియజేస్తాయి. నిలబడిన నాలుగు పిల్లర్లు వాళ్ల పాలనలో ధర్మం నాలుగు పాదాల మీద నడిచిందనడానికి నిదర్శనం. హంసలు, మొసళ్లు, పద్మాలు, ముఖాలు, తలకిందులుగా వేలాడినట్లుండే తామర మొగ్గల వంటి ఆకృతులు.. ఇలా ఎన్నో అంశాల కలబోతే కాకతీయ తోరణాలు. అంతేకాదు కాకతీయుల ధైర్య సాహసాలకు నిదర్శనంగా ఈకళాతోరణాలు నిలుస్తున్నాయి.

ఓరుగల్లు కోటకు లభించని యునెస్కో హోదా

ప్రతిపాదనల పురోగతిలో స్తబ్దత

పర్యాటకులకు తప్పని ఎదురుచూపులు

ప్రపంచాన్ని కట్టిపడేస్తున్న శిల్పకళా

సంపద

దేశవిదేశీయుల సందడి..

కాకతీయుల కళా వైభవం ప్రపంచానికి తెలిసినా వారసత్వ సంపద యునెస్కో గుర్తింపు కోసం పురావస్తుశాఖ, ప్రజా ప్రతినిధులు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనే ఆనాటి కాంగ్రెస్‌ సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి, ఆతర్వాత వచ్చిన సీఎం కిరణకుమార్‌రెడ్డి నిర్వహించిన కాకతీయ ఉత్సవాలతో కాకతీయుల విశిష్టతకు ప్రాచుర్యాన్ని కల్పించారు. యునెస్కో గుర్తింపు తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని కేంద్ర పెద్దలు చెబుతున్నారు. ఓరుగల్లు కోటకు దేశవిదేశీయుల తాకిడి పెరిగింది. ఇప్పటికై నా యునెస్కో కాకతీయ కళాసంపదను గుర్తించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement