పూల కోసం వెళ్లి మృత్యుఒడికి.. | - | Sakshi
Sakshi News home page

పూల కోసం వెళ్లి మృత్యుఒడికి..

Oct 12 2026 8:40 AM | Updated on Oct 12 2026 8:40 AM

మహబూబాబాద్‌ రూరల్‌ : తామరపూలు కోసేందుకు వెళ్లి కుంటలో పడి వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో ఆదివారం ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. జిల్లా కేంద్రంలోని నందమూరినగర్‌కు చెందిన బచ్చలి కుమార్‌ (45)కు భార్య, కుమారుడు ఉన్నారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం మాధవన్న కాలనీ సమీపంలో గల దామరకుంట వద్ద తామరపూలు కోసేందుకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు అదే కుంటలో పడి మృతి చెందగా ఆదివారం మృతదేహం తేలియాడుతూ కనిపించడంతో స్థానికులు అతడి భార్య స్వప్న, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సూరయ్య తెలిపారు.

కుంటలో పడి వ్యక్తి మృతి

మానుకోటలో ఘటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement