కాకతీయుల శిల్పకళా వైభవానికి ప్రతీక ఓరుగల్లు కోట. నాటి శిల్పలు నల్లరాతిలో చెక్కిన అద్భుత శిల్పకళా సంపద, కాకతీయ కళాతోరణం పర్యాటకులను కట్టిపడేస్తాయి. రాష్ట్ర రాజముద్రలోనూ ప్రత్యేక స్థానం పొందిన ఈతోరణానికి యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు దక్కాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాకతీయ కళారాజ్యాన్ని యునెస్కో గుర్తించేలా చర్యలు తీసుకోవాలి. ఈ అపురూప కళాసంపదను భావితరాలకు అందించేలా చొరవ చూపాలి.
– ప్రొఫెసర్ పాండురంగారావు,
కాకతీయ హెరిటేజ్ ట్రస్టీ,
ఇన్‌టాక్ కన్వీనర్


