మంగళవారం శ్రీ 6 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

మంగళవారం శ్రీ 6 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026

Oct 6 2026 1:24 AM | Updated on Oct 6 2026 1:24 AM

8లో

న్యూస్‌రీల్‌

ఓటరు నమోదు ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలి

కలెక్టర్‌ స్నేహశబరీష్‌

మహబూబాబాద్‌: ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియను పకడ్బందీ నిర్వహించాలని కలెక్టర్‌ స్నేహశబరీష్‌ అఽధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని ప్రధాన సమావేఽశ మందిరంలో సోమవారం ఎన్నికలపై జిల్లాస్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ స్నేహశబరీష్‌ మాట్లాడుతూ.. అర్హులు ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు. వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ పట్టభధ్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఓటరు జాబితాలో ఓటరుగా నమోదు చేసుకునేందుకు నిబంధనలు పాటించాలన్నారు. ఓటరు నమోదుపై విస్తృతంగా ప్రచారం చేసి అవగాహన కల్పించాలన్నారు. 01–11–2023నాటికి కనీసం మూడు సంవత్సరాల డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులన్నారు. దరఖాస్తుతో పాటు విద్యార్హతకు సంబంధించిన ధ్రువీకరణ, అవసరమైన ఇతర పత్రాలు జత చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ అనిల్‌కుమార్‌, జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.

గణిత విద్యను సమర్థవంతంగా బోధించాలి

మహబూబాబాద్‌ అర్బన్‌: సాంకేతికతను వినియోగించుకుంటూ విద్యార్థులకు గణిత విద్యను సమర్థవంతంగా బోధించాలని ఇన్‌చార్జ్‌ డీఈఓ శ్రీరాములు అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో సోమవారం గణిత ఉపాధ్యాయులకు బుక్‌ ఆఫ్‌ డిజిటల్‌ లెర్నింగ్‌ గణిత శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. గణిత బోధనను కేవలం పాఠ్యపుస్తకాలకు పరిమితం కాకుండా చూడడం, ఆలోచణ చేయడం, సమస్యలను పరిష్కరించడంలో అనుభవాత్మక అభ్యసన చేయాలన్నారు. డిజిటల్‌ లెర్నింగ్‌తో విద్యార్థుల్లో ఆలోచన, నైపుణ్యాలు, సృజనాత్మకత, గణితంపై ఆసక్తి పెంపొందించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్‌ఓ ఆప్పారావు, సీఎంఓ సురేష్‌, డిఆర్పీలు సదయ్య, మహేష్‌, గణిత ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

తల్లిదండ్రులను పట్టించుకోని కుమారుడికి నోటీసులు

దంతాలపల్లి: తల్లిదండ్రులను పట్టించుకోని కుమారుడికి నోటీసులు జారీ చేసినట్లు తహసీల్దార్‌ సునీల్‌కుమార్‌ తెలిపారు. మండలంలోని దాట్ల గ్రామానికి చెందిన కాంసాని వెంకటరెడ్డి, ధనమ్మ దంపతులకు కుమారుడు మధుకర్‌ రెడ్డి ఉన్నాడు. కొన్నినెలలుగా ఆలనాపాలనా చూడడం లేదని, గ్రామంలో కాకుండా మండల కేంద్రంలోని తమకు చెందిన ఇంట్లో ఉంటున్నాడని తల్లిదండ్రులు మధుకర్‌రెడ్డిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. కుమారుడు పట్టించుకోకపోవడంతో 8నెలలుగా మండలంలోని వేములపల్లి గ్రామంలోని తమ కూతురు ఇంట్లో ఉంటున్నట్లు వారు పేర్కొన్నారు. కాగా, తొర్రూరు ఆర్డీఓ గణేష్‌ ఆదేశాల మేరకు తహసీల్దార్‌ సునీల్‌కుమార్‌, ఎస్సై రవికుమార్‌ సోమవారం మధుకర్‌రెడ్డికి నోటీసులు జారీ చేశారు. పది రోజుల్లో ఇల్లు ఖాళీ చేయాలని తెలిపారు.

ఎస్సైపై ఎస్పీకి ఫిర్యాదు

మహబూబాబాద్‌ రూరల్‌: వ్యవసాయ బావి మోటారు ద్వారా పొలానికి నీరు సరఫరా చేసే విషయంలో బయ్యారం మండలం సంతులాల్‌ పోడుతండాకు చెందిన మాలోత్‌ చంటిని గార్ల ఎస్సై సాయికుమార్‌ కొట్టాడని ఆరోపిస్తూ ఎస్పీ కార్యాలయంలో ఈనెల 2న ఫిర్యాదు చేయగా సోమవారం ఆలస్యంగా వెలుగుచూసింది. బాధితుడి భార్య మాలోత్‌ రోజీ ఎస్పీ కార్యాలయంలో ఇచ్చిన ఫిర్యాదులోని వివరాలు ఇలా ఉన్నాయి. మాలోత్‌ చంటి అతడి అన్న మాలోతు హరికి పొత్తులో వ్యవసాయ బావి ఉంది. కాగా బావిలోని మోటారు ద్వారా చంటి పొలానికి హరి నీళ్లు సరఫరా చేయకుండా వేరే వ్యక్తులకు నీళ్లు ఇస్తున్నాడు. ఇదేమిటని చంటి కుటుంబ సభ్యులు హరిని నిలదీశారు. ఈమేరకు హరి గార్ల పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. ఎస్సై సాయికుమార్‌ ఎటువంటి విచారణ చేయకుండా చంటిని గార్ల పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించి దుర్భాషలాడి, తీవ్రంగా కొట్టారు. మనోవేదనకు గురైన చంటి పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆయనను మహబూబాబాద్‌ ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి పట్టణంలోని మరో ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు.

అమ్మచేతిలో స్మార్ట్‌ఫోన్‌..

గతంలో పోలిస్తే జిల్లాలో పురుషులకు దీటుగా మహిళలు ఇంటర్నెట్‌, స్మార్ట్‌ఫోన్‌లు వినియోగిస్తున్నారని చెప్పవచ్చు. పదో తరగతి లేదా.. అంతకన్న ఎక్కువ చదివిన మహిళలు గతంలో 34.7శాతం ఉంటే.. ఇప్పుడు ఈ సంఖ్య 45.2శాతానికి చేరింది. అదేవిధంగా గతంలో పురుషులు 25.6శాతం, మహిళలకు 16.1శాతం ఇంటర్‌నెట్‌ వినియోగించేది. కానీ ఇప్పుడు 52.2శాతం మహిళలు, 80శాతానికి పైగా పురుషులు ఇంటర్నెట్‌ వినియోగిస్తున్నారు. అంటే జిల్లాలోని సగం మంది మహిళల చేతుల్లో స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నట్లు స్పష్టం అవుతోంది.

జిల్లాలో తగ్గిన బాల్యవివాహాలు, విద్యలో మెరుగు

సాక్షి, మహబూబాబాద్‌: మహబూబాబాద్‌ జిల్లా అంటే మారుమూల గ్రామాలు, తండాలు, ఆదివాసీ గూడేలు. గతంలో విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు, అంతంతగానే ఆధునిక విజ్ఞానం. మహిళలకు అయితే ఇది అందని ద్రాక్షలా ఉండేది. అయితే గత పదేళ్లలో జిల్లాలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. దీంతో విద్య, వైద్యం, ఇంటర్నెట్‌ వినియోగం మొదలైన అంశాల్లో పురుషులతో పాటు మహిళల్లో ప్రగతి కనిపించింది. ముఖ్యంగా బాల్య వివాహాలు తగ్గాయి. కాగా, కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన జాతీయ కుటుంబ, ఆరోగ్య సర్వే ద్వారా అనేక అంశాలు వెల్లడించారు.

తగ్గిన బాల్య వివాహాలు..

నిరక్షరాస్యత, గిరిజన తండాలు, ఆదివాసీ గూడేలు ఎక్కువగా ఉండటంతో ఇతర జిల్లాలో పోలిస్తే జిల్లాలో బాల్య వివాహాల సంఖ్య ఎక్కువగా ఉండేది. అయితే అక్షరాస్యులు పెరగడంతో పాటు అనేక రకాల అవగాహన కార్యక్రమాలు, పిల్లల్లో ఉద్యోగాలు సంపాదించిన తర్వాతే పెళ్లి చేసుకుంటామనే ఆలోచన రావడంతో జిల్లాలో బాల్య వివాహాలు తగ్గాయి. గతంలో జిల్లాలో బాల్య వివాహాల సంఖ్య 28.3శాతం ఉండగా.. ఇప్పుడు 15.8శాతానికి తగ్గింది. అదే విధంగా కనీసం మైనార్టీ తిరకముందే తల్లులు అయిన వారు గతంలో 6.6శాతం ఉంటే.. ఇప్పుడు 5.4శాతానికి తగ్గింది. అయితే పాఠశాలలు, కళాశాలల్లో ఇంకా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ప్రముఖులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

పెరిగిన ఆస్పత్రి ప్రసవాలు..

తల్లిగర్భం దాల్చిన నాటి నుంచి బిడ్డకు పురుడు పోయడం, తర్వాత పిల్లల సంరరక్షణ మొదలైన అంశాల్లో జిల్లాకు సముచిత స్థానం వచ్చింది. గర్భం దాల్చిన మహిళల్లో ప్రతీ నెల పరీక్షలు చేయించుకోవడం, క్రమం తప్పకుండా మందులు వినియోగం, ప్రసవం కూడా డాక్టర్‌ పర్యవేక్షణలోనే జరిగేలా చూడడం వంటి అంశాల్లో గతం కన్నా మెరుగైన పద్ధతులు పాటిస్తున్నారు. గతంలో ఆస్పత్రుల్లో 97.7శాతం ప్రసవాలు జరగగా ప్రస్తుతం 98.2శాతం జరుగుతున్నాయి. అయితే ఇందులో నూటికి 70మందికి ఆపరేషన్‌ ద్వారా ప్రసవం చేయడం కొంత విచారకరం. కుటుంబ పరిస్థితికి అనుగుణంగా పిల్లలకు జన్మనివ్వడం, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు, ఇతర పద్ధతులు పాటిస్తున్నారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకున్న వారిలో 68.9శాతం మహిళలే ఉండడం గమనార్హం. గతంలో 15.6శాతం పిల్లలు వ్యాధులు బారిన పడగా, ఇప్పుడు వ్యాధి నిరోధక టీకాలు వేయించడం ద్వారా వ్యాధుల బారిన పడుతున్నవారి సంఖ్య 11.2శాతానికి తగ్గింది.

పోషకాహార లోపం..

ఆస్పత్రి ప్రసవాలు, తల్లీబిడ్డల ఆరోగ్యంపై శ్రద్ధచూపే ప్రభుత్వం పిల్లలకు సరైన పోషకాహారం అందించడంలో మాత్రం వెనకబడి ఉంది. పుట్టిన బిడ్డకు తల్లిపాలు ప్రారంభించే పిల్లలకు గతంలో 50.5శాతం మందికి సరైన పోషకాహారం అందగా ఇప్పుడు కాస్త మెరుగ్గా 54.1శాతానికి చేరింది. 6–23 నెలల పిల్లల్లో 12శాతం మందికే పోషకాహారం అందుతుంది. అదే విధంగా 5 సంవత్సరాలలోపు పిల్లల్లో 32శాతం మందికే పోషకాలతో కూడిన ఆహారం అందడం విచారకరం.

దరఖాస్తుల ఆహ్వానం

మహబూబాబాద్‌ అర్బన్‌: జిల్లాలోని అన్ని ప్రభుత్వ యాజమాన్యాల 69 పాఠశాలల్లో బాలికలకు సెల్ఫ్‌ డిఫెన్స్‌ నిమిత్తం 3 నెలలు శిక్షణ ఇవ్వడానికి తాత్కాలిక పద్ధతిలో అర్హులైన శిక్షకుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఇన్‌చార్జ్‌ డీఈఓ శ్రీరాములు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు నేటి నుంచి ఈ నెల 8వ తేదీ వరకు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలన్నారు. ఎంపికై న శిక్షకులకు నెలకు రూ.5 వేల చొప్పున 3 నెలలు వేతనం చెల్లిస్తామన్నారు. మహిళలకు మొదటి ప్రాధాన్యం ఇస్తామన్నారు.

పీఎంశ్రీ పాఠశాలల్లో..

జిల్లాలోని పీఎంశ్రీ పాఠశాలల్లో ప్రత్యేక అవసరాల విద్యార్థులకు బోధించడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఇన్‌చార్జ్‌ డీఈఓ శ్రీరాములు సోమవారం తెలిపారు. 2026–27 విద్యా సంవత్సరంలో నెలకు రూ.16,500 చొప్పున గౌరవ వేతనం చెల్లిస్తామని, ఐదు నెలల పాటు పనిచేయాల్సి ఉంటుందన్నారు. బీఈడీ, డిప్లొమా ఇన్‌ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌, సాధారణ విద్యలో బీఈడీతో పాటు పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి ఉండాలన్నారు. స్థానిక పీఎంశ్రీ పాఠశాలలో నేటి నుంచి ఈ నెల 9వ తేదీ సాయంత్రం 4గంటల వరకు దరఖాస్తులు సమర్పించాలన్నారు. కొత్తగూడ, కేసముద్రం, తొర్రూరు టీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌ స్కూల్స్‌, చిలుకోడు, నెల్లికుదురు, మహబూబాబాద్‌, మరిపెడ, గుర్తూరు మోడల్‌ స్కూళ్లు, డోర్నకల్‌, కంబాలపల్లి, మహబూబాబాద్‌,పొనుగోడు, కేసముద్రం స్టేషన్‌, నర్సింహులపేట, బయ్యారం, సీతారాంపురం, దంతాలపల్లి, తొర్రూ రు, అవుతాపురం జెడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయని, దరఖాస్తులు ఆయా పాఠశాలల హెచ్‌ఎంలకు అందజేయాలన్నారు.

నల్లాల్లో నీళ్లొచ్చాయ్‌..

డోర్నకల్‌: డోర్నకల్‌ మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఎట్టకేలకు నల్లాల ద్వారా నీటి సరఫరా ప్రారంభమైంది. కొద్ది రోజులుగా భగీరథ నీటి సరఫరా నిలిచిపోవడం, మున్నేరువాగులో నిండుగా నీరున్నా సరఫరా చేయకపోవడంతో స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఇటీవల సాక్షి దినపత్రికలో కథనం వెలువడింది. దీనిపై స్పందించిన మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కొండేటి రాజకుమారిహరినాథ్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ మాదా లావణ్యాశ్రీనివాస్‌ మున్సిపల్‌ సిబ్బందితో కలిసి రెండు రోజులు శ్రమించి మున్నేరువాగు నుంచి పట్టణానికి నీటిని సరఫరా చేసేందుకు కృషి చేశారు. సోమవారం మున్సిపల్‌ కార్యాలయ ఆవరణలో ఓవర్‌ హెడ్‌ ట్యాంకు నుంచి నీటిని విడుదల చేసిన కొండేటి రాజకుమారి, మాదా లావణ్య పట్టణంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి నల్లాల ద్వారా వస్తున్న నీటిని పరిశీలించి స్థానికులతో మాట్లాడారు. ప్రస్తుతం నల్లాల ద్వారా సరఫరా అవుతున్న నీటిని తాగొద్దని, వంట కోసం వినియోగించవద్దని విజ్ఞప్తి చేశారు. కొద్ది రోజుల్లో పట్టణమంతా నీటిని సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు.

బొగత వద్ద ప్లాస్టిక్‌ సేకరణ

వాజేడు: బొగత జలపాతం పరిసరాల్లో పడేసిన ప్లాస్టిక్‌ వస్తువులను అటవీ శాఖ, బొగత సిబ్బంది సంయుక్తంగా సేకరించారు. జాతీయ వన్యప్రాణి వారోత్సవాల్లో భాగంగా బొగత జలపాతం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ప్లాస్టిక్‌ వస్తువుల వినియోగాన్ని నివారించడంలో భాగంగా సోమవారం సేకరించారు. ఈ సందర్భంగా రేంజర్‌ నరేందర్‌ మాట్లాడుతూ జలపాతానికి వచ్చే పర్యాటకులు ప్లాస్టిక్‌ వస్తువులను వెంట తీసుకురావద్దని తెలిపారు. ప్లాస్టిక్‌తో పర్యావరణం దెబ్బతింటుందని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌ఎస్‌ఓలు నారాయణ, భిక్షపతి, చిన్నక్క, ఎఫ్‌బీఓ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

కేసముద్రం మార్కెట్‌కు అమ్మకానికి వచ్చిన మక్కలు

కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌లో తొలిరోజు మక్కలకు రికార్డు స్థాయిలో ధర రూ.2,618 పలికింది. చుట్టు పక్కల గ్రామాల రైతులు వానాకాలం పండించిన మక్కలను అమ్ముకునేందుకు మార్కెట్‌కు తీసుకువచ్చారు. సోమవారం మార్కెట్‌కు 1,529 బస్తాల మక్కలు అమ్మకానికి రాగా, క్వింటా గరిష్ట ధర రూ.2,618, కనిష్ట ధర రూ.2,159 పలికినట్లు మార్కెట్‌ అధికారులు తెలిపారు. మక్కలకు మద్దతు ధర రూ.2,410 ఉండగా, అంతకు మించి ధర పలకడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. – కేసముద్రం

మక్కలకు

రికార్డు ధర రూ.2,618

పశు సంవర్థకశాఖలో రూ.7లక్షల కరెంట్‌ బిల్లులు పెండింగ్‌

ఏడాదిగా రాని ఆఫీస్‌ మెయింటనెన్స్‌ బిల్లు

ఆర్థిక భారం పడుతుందంటున్న సిబ్బంది

వేధిస్తున్న సిబ్బంది కొరత

పూర్తిస్థాయిలో లేని పలు మందులు

డాక్టర్‌ పర్యవేక్షణలోనే 99శాతం ప్రసవాలు

ఇంటర్నెట్‌ వినియోగంలో భేష్‌

పిల్లల్లో పోషకాహార లోపం..

తేల్చిచెప్పిన ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌ సర్వే

ఎన్‌ఎఫ్‌ఎస్‌ సర్వే వివరాలు(శాతంలో..)

అంశం 2019–21 2023–24

5 ఏళ్లలోపు జనాభా 6.3 5.8

15 ఏళ్లలోపు జనాభా 21.8 17.5

60 ఏళ్లు పైబడిన వారు 13.4 16.8

విద్యుత్‌ ఉన్న కుటుంబాలు 99.6 95.9

మెరుగైన తాగునీటి వనరు 98.2 99.1

అయోడైజ్డ్‌ ఉప్పు వినియోగం 96.2 99.5

ఆరోగ్య బీమా 79.9 88.9

బ్యాంకు/పోస్టాఫీస్‌ ఖాతా 98.2 98.8

6ఏళ్ల బాలికలు

పాఠశాలకు వెళ్లిన వారు 55.0 51.6

మహిళల పేరున ఇల్లు, భూమి 25.9 33.0

10కంటే ఎక్కువ చదివిన మహిళలు 34.7 45.2

10కంటే ఎక్కువ చదివిన పురుషులు 43.3 61.2

ఇంటర్నెట్‌ వినియోగించే పురుషులు 25.6 80.0

ఇంటర్నెట్‌ వినియోగించే మహిళలు 16.1 55.2

18ఏళ్లకు ముందే వివాహం

చేసుకున్న మహిళలు 28.3 15.8

19సంవత్సరాలలోపు

గర్భం దాల్చిన వారు 6.6 5.4

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement