ఓటు హక్కును కాలరాస్తున్న బీజేపీ | - | Sakshi
Sakshi News home page

ఓటు హక్కును కాలరాస్తున్న బీజేపీ

Oct 6 2026 1:06 AM | Updated on Oct 6 2026 1:06 AM

నెహ్రూసెంటర్‌: దేశవ్యాప్తంగా ఎన్నికల సంఘం అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలతో ప్రజాస్వామ్యమైన ఓటు హక్కును కాలరాసేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని ఇండియా కూటమి పార్టీల నేతలు అన్నారు. జిల్లా కేంద్రంలో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఓట్ల తొలగింపునకు కుట్రలు చేసిన సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. బిహార్‌లో ఎస్‌ఐఆర్‌ ద్వారా మొదలుపెట్టిన ఓట్ల దొంగతనం దేశవ్యాప్తంగా విస్తరించినట్లు మండిపడ్డారు. రాజ్యాంఽగాన్ని, ఓటు హక్కును కాపాడాల్సిన ఎన్నికల కమిషన్‌ రాజ్యాంగానికి వ్యతిరేకంగా పని చేస్తోందని ఆరోపించారు. ఇంటింటి సర్వే చేపట్టకుండానే జిల్లాలో అకారణంగా అర్హుల ఓట్లను తొలగించారని మండిపడ్డారు. ఓట్ల తొలగింపుపై సుప్రీంకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. అర్హులైన ఓట్లను తొలగించడాన్ని నిరసిస్తూ ఇండియా కూటమి పార్టీలు మంగళవారం చేపట్టనున్న చలో కలెక్టరేట్‌కు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గుగులోత్‌ జ్యోతిరమేశ్‌, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు బెల్లంకొండ శ్రీనివాస్‌, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బి.అజయ్‌సారథిరెడ్డి, సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ డివిజన్‌ కార్యదర్శి హెచ్‌.లింగ్యా, సీపీఐ(ఎంఎల్‌) మాస్‌లైన్‌ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రవి, మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ సూర్నపు సోమయ్య, సమ్మెట రాజమౌళి, బానోత్‌ సీతారాంనాయక్‌, పెరుగు కుమార్‌, వార్డు కౌన్సిలర్లు రేషపల్లి నవీన్‌, దిలీప్‌, బోళ్ల రాజు, నాయకులు వెంకన్న, ఎండి.రజాక్‌, గుగులోత్‌ కిషన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement