వరంగల్ స్పోర్ట్స్ : హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో సోమవారం ఉమ్మడి వరంగల్ జిల్లా ఎస్‌జీఎఫ్–19 క్రీడా పోటీలు నిర్వహించారు. నాలుగో విడతలో భాగంగా చెస్, సాఫ్ట్ టెన్నిస్, క్యారం, వూషూ, సెపక్తక్రా పోటీలు జేఎన్ స్టేడియంలో, బాడ్మింటన్‌ను ఎల్‌బీ కాలేజీ ఇండోర్ గ్రౌండ్‌లో నిర్వహించారు. ఈ పోటీల్లో సుమారు 600మంది క్రీడాకారులు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై న విద్యార్థులను ఎస్‌జీఎఫ్ అండర్–19 జిల్లా కార్యదర్శి నరేడ్ల శ్రీధర్ అభినందించారు. కార్యక్రమంలో డాక్టర్ సతీశ్, డాక్టర్ గోపి, ప్రభాకర్ రెడ్డి, దేవేందర్, శ్రీనివాస్, రమేశ్, తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ తీగలు తాకి
వన్యప్రాణుల మృత్యువాత
గణపురం : జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం రవినగర్ శివారు ఫారెస్టు సరిహద్దులోని ఆయిల్ పామ్ తోటలో వన్యప్రాణుల వేట కోసం గ్రామానికి చెందిన రావుల రాకేశ్ విద్యుత్ తీగలను అమర్చగా వాటిని తాకి రెండు అడవి పందులతోపాటు, ఒక పాడిగేదె మృత్యువాత పడింది. ఈ ఘటనలో రాకేశ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ బి. చంద్రమౌళి తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. ఫారెస్టు శివారులోని ఆయిల్‌పామ్ తోటలో గత నెల 29న రాకేశ్ విద్యుత్ తీగలు అమర్చగా రెండు అడవిపందులతో పాటు మేత కోసం వచ్చిన పాడిగేదె షాక్‌కు గురై మృత్యువాత పడ్డాయి. ఈ ఘటనపై గ్రామస్తుల సమాచారం మేరకు విచారణ చేపట్టి నిందితుడిని సోమవారం కోర్టులో హాజరు పర్చగా న్యాయమూర్తి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించినట్లు తెలిపారు. అనంతరం నిందితుడిని పరకాల సబ్ జైలుకు తరలించినట్లు ఎఫ్‌ఆర్‌ఓ వివరించారు. కార్యక్రమంలో చెల్పూరు ఎఫ్‌ఎస్‌ఓ రా జేందర్, బీట్ ఆఫీసర్ నాగలక్ష్మి పాల్గొన్నారు.
యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌కు బొగ్గు కొరత
హన్మకొండ : యాదాద్రి థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి బొగ్గు కొరతతో తరచూ అంతరా యం ఏర్పడుతోందని తెలంగాణ విద్యుత్ జేఏ సీ రాష్ట్ర చైర్మన్ పి.శ్రీనివాస్, కన్వీనర్ మన్నె శశికుమార్ తెలిపారు. డీపీఆర్ ప్రకారం ఈ కేంద్రానికి ఏటా రూ.1.37 కోట్ల టన్నుల ఏ8/ఏ9 గ్రేడ్ బొగ్గు అవసరమని వారు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2022లో టీజీ జెన్ కో, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌తో బొగ్గు సరఫరా ఒ ప్పందం చేసుకుందన్నారు. యాదాద్రికి నాణ్య మైన బొగ్గును సరఫరా చేయడం సాధ్యం కాదని సింగరేణి కాలరీస్ ప్రభుత్వం దృష్టికి తీ సుకు వచ్చినట్లు వార్తలు వచ్చాయని తెలిపా రు. ప్రస్తుతం ఏ13/ఏ15 గ్రేడ్ నాసిరకం బొగ్గు ను వినియోగించడం వల్ల సాంకేతిక ట్రిప్పులు, తరచూ విద్యుత్ అంతరాయాలు ఏర్పడుతున్నాయని ఆరోపించారు. బొగ్గు కొరతతో యూనిట్లు నిలిచిపోతున్నాయని, యూనిట్–5 పనులు కూడా ఆలస్యమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో విద్యుత్ డి మాండ్ రికార్డు స్థాయిలో నమోదవుతున్న సమయంలో యాదాద్రిలో ఉత్పత్తి లోటును ఖరీ దైన స్వల్ప కాలిక విద్యుత్ కొనుగోళ్ల ద్వారా భర్తీ చేయాల్సి వస్తోందని వారు వివరించారు. ఈ పరిస్థితికి క్షేత్రస్థాయి ఉద్యోగులు, డిస్కంలు బాధ్యులు కాదని, బొగ్గు అనుసంధాన ప్రణా ళి కలోని లోపాలే ప్రధాన కారణమని స్పష్టం చే శారు. నేటినుంచి కోల్ ఇండియాతో జరగను న్న చర్చల్లో సింగరేణి ప్రయోజనాలకు భంగం కలగకుండా యాదాద్రి కేంద్రానికి ఏ8/ఏ9 గ్రేడ్ బొగ్గు స రఫరాపై భ రోసా కల్పించాలని విజ్ఞప్తి చేశారు.


