వినతులు త్వరగా పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

వినతులు త్వరగా పరిష్కరించాలి

Oct 6 2026 1:06 AM | Updated on Oct 6 2026 1:06 AM

● కలెక్టర్‌ స్నేహశబరీష్‌

మహబూబాబాద్‌: ప్రజావాణిలో వచ్చిన ప్రతీ వినతిని త్వరగా పరిష్కరించాలని కలెక్టర్‌ స్నేహశబరీష్‌ అధికారులు ఆదేశించారు. కలెక్టరేట్‌లోని ప్రధాన సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించగా కలెక్టర్‌ స్వయంగా దరఖాస్తులు స్వీకరించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. అన్ని సంక్షేమ వసతిగృహాల నిర్వహణపై ప్రత్యేక అధికారులు శ్రద్ధ పెట్టాలన్నారు. మెనూకు సంబంధించిన ఫొటోలు గ్రూపులో పెట్టాలని ఆదేశించారు. పెండింగ్‌ వినతులు కూడా త్వరగా పరిష్కరించాలన్నారు. ప్రజావాణిలో 146 వినతులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ అనిల్‌కుమార్‌, ఇన్‌చార్జ్‌ అదనపు కలెక్టర్‌ పురుషోత్తం, జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement